‘‘భారతీయులు వీసా గడువు కన్నా ఎక్కువ కాలం ఉంటున్నారు’’
అమెరికా కాంగ్రెస్ ముందు వివరించిన సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్;
By : Praveen Chepyala
Update: 2025-01-30 08:26 GMT
అమెరికాలో వీసా గడువు ముగిసినప్పటికీ కొంతమంది విద్యార్థులు, టూరిస్టులు చట్టవిరుద్దంగా దేశంలోనే ఉన్నారని ఒక నిఫుణుడు యూఎస్ చట్టసభ సభ్యులకు చెప్పారు. ఆమె హెచ్ వన్ బీ వీసాలతో సహా అనే ఇమ్మిగ్రేషన్ విధానాలలో అనేక సంస్కరణలు ప్రతిపాదించారు.
‘‘అమెరికా లో ఇమ్మిగ్రేషన్ ఎన్ ఫోర్స్ మెంట్ ను పునరుద్దరించడంపై’’ విచారణ సందర్భంగా సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ నుంచి జెస్సికా ఎమ్ వాఘన్ యూఎస్ హౌజ్ కమిటీకి చెప్పారు. దేశానికి వచ్చిన 32 దేశాల విద్యార్థులు, టూరిస్టులు ఓవర్ స్టే రేట్లు 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు.
ప్రస్తుతం విద్యార్థుల కోసం అమెరికా ఎఫ్, ఎం కేటగిరీ వీసాలు జారీ చేస్తున్నారు. ఎఫ్ 1 వీసా ఒక వ్యక్తి గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం, సెమినరీ, కన్సర్వేటరీ, అకడమిక్ హైస్కూల్, ఎలిమెంటరీ స్కూల్ లేదా ఇతర విద్యాసంస్థలు లేదా భాషా శిక్షణా కార్యక్రమంలో పూర్తి సమయం విద్యార్థిగా యూనైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించడానికి ఇస్తారు. ఎం 1 వీసా లో భాషా శిక్షణ కాకుండా వృత్తిపరమైన లేదా నాన్ కాడెమిక్ ప్రొగ్రామ్ లలో విద్యార్థులకు జారీ చేస్తున్నారు.
వీసాలు తీసుకుని ఎక్కువ కాలం అమెరికాలో ఉంటున్న వారిలో బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ దేశాలకు చెందిన వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఈ సంఖ్య 2023 కు సంబంధించిన డేటా అని ఆమె వివరించారు. భారత్ నుంచి దాదాపుగా ఏడువేల మంది విద్యార్థులు, సందర్శకులు ఇందులో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వీసాల జారీ విధానాలకు సర్ధుబాట్లు అవసరమని తెలిపారు.
లాభాపేక్ష లేని, పరిశోధనా రంగంలో సహ మొత్తం సంఖ్య 75 వేల లేదా అంతకంటే తక్కువకు పరిమితం చేయాలి. ఏదైన వర్గం ఓవర్ సబ్ స్క్రైబ్ అయితే అత్యధిక నైపుణ్యం కలిగిన కార్మికులకు బదులుగా అత్యధిక వేతనం ఇస్తున్న యజమానులకు వీసాలు ఇవ్వాలని ఆమె ప్రతిపాదించారు.
ఫెడరల్ ఏజెన్సీలు మాత్రమే పరిమిత పరిస్థితులలో మాత్రమే వీసా కార్మికులకు ఆమోదం పొందేందుకు అనుమతించాలి. నైపుణ్యం తక్కువ, వేతన వృత్తులలో యునైటెడ్ స్టేట్స్ కు కార్మికుల కొరత లేదని వాఘన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజానికి శ్రామిక మార్కెట్ నుంచి తప్పుకుని పని వయస్సు గల మిలియన్ల మంది అమెరికన్లు ఉన్నారు. స్టెమ్( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సెక్టార్ లో కూడా రెండుమిలియన్ల కంటే ఎక్కువ అమెరికాలో ఉన్నాయని అన్నారు. అమెరికన్ కార్మికులకు అవకాశాలను పెంచడానికి కాంగ్రెస్ వీసా కార్యక్రమాలను సరిదిద్దాలని సూచించారు.
‘‘ మొదట, విదేశీ వీసా కార్మికులకు స్పాన్సర్ చేయడానికి స్టాప్ కంపెనీలకు అనుమతించకూడదు’’ ఈ కంపెనీలు యూఎస్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనాలకు పని చేసే విదేశాల్లోని కార్మికులతో రూపొందించడిన వ్యాపార నమూనా ఆధారంగా పని చేస్తాయి. కార్మికులకు చట్టవిరుద్దమైన నియామక పద్ధతులతో సంబంధం కలిగి ఉన్నాయని ఆమె ఆరోపించారు.