నేడు ఆకాశంలో కనిపించనున్న బ్లడ్ మూన్
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఏర్పడనున్నఖగోళ అద్భుతం;
By : Praveen Chepyala
Update: 2025-09-07 11:41 GMT
ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. బ్లడ్ మూన్ లేదా చంద్ర గ్రహణం దేశంలో కనిపించనుంది. సెప్టెంబర్ రాత్రి 7-8 తేదీలలో రాత్రి చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించనున్నారు. దీనిని బ్లడ్ మూన్ గా పిలుస్తారు.
కారణం ఏంటీ?
సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి, సూర్యుడికి, చంద్రుడికి మధ్య చతురస్రాకారం ఏర్పడనుంది. తద్వారా చంద్రుని ఉపరితలాన్ని కప్పి ఉంచే నీడ ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు మసకబారడానికి బదులుగా చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీనిని సాధారణంగా బ్లడ్ మూన్ గా పిలుస్తారు.
ఎరుపు తో పాటు నారింజ..
ఈ రంగు సహజంగానే సంభవిస్తుంది. ఎందుకంటే సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రవహించే సమయంలో తక్కువ నీలి తరంగ దైర్ఘ్యాలు వెదజల్లే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎరుపు, నారింజ రంగులో చంద్రుడు కనిపించడానికి కారణమైంది. సూర్యగ్రహణం వలే కాకుండా ఇది పగటిపూట క్లుప్తంగా చీకటిగా మారుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఫలితంగా చంద్రుడి ఎర్రటి కాంతి రేలీ పరిక్షేపణం చేస్తుంది. సూర్యకాంతి భూమి వాతావరణం గుండా వెళ్తున్నప్పుడూ నీలం, వైలెంట్ వంటి తక్కువ తరంగ దైర్ఘ్యాలు చెల్లాచెదురు అవుతాయి.
ఇది ఎంతకాలం..
ఈ గ్రహణాన్ని ప్రత్యేకంగా నిలిపేది దాని అద్భుతమైన నిడివి, మొత్తం దశ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగుతోంది. ఇది ఇటీవల కాలంలో అత్యంత పెద్దదైన చంద్రగ్రహణం. ఇది ఖగోళ పరిశోధకులకు, ఔత్సాహికులకు అద్భుతాన్ని ఆస్వాదించడానికి తగినంత అవకాశాన్ని అందిస్తుంది.
ఎక్కడ కనిపిస్తుంది..
ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ లో కనిపిస్తుంది. అనేక ఖండాలలో నివసిస్తున్న దాదాపు ఏడు మిలియన్ల మంది ప్రజలు ఈ దృశ్యాన్ని వీక్షించడానికి వీలు కల్పిస్తుంది.
యాంగోన్, షాంఘై, జోహన్నెస్ బర్గ్, లాగోస్, కైరో, బ్యాంకాక్, జకార్తా, బెర్లిన్, మాస్కో, సియోల్, రోమ్, ఢాకా, బుడాపేస్ట్, మనీలా, ఏథెన్స్, సింగపూర్, మెల్ బోర్న్, బుకారెస్ట్, సిడ్నీ, సోఫియా, టోక్యో, బీజింగ్, అంకారా, బ్రస్సెల్స్, ఆమ్ స్టర్ డామ్, పారిస్, లండన్, మాడ్రిడ్ నగరాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంది.
భారత్ లోని కోల్ కత గ్రహాణాన్ని వీక్షించడానికి అత్యుత్తమ ప్రదేశంగా ఉంటుంది. అలస్కా, అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో ఇది పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు కూడా ఇది కనిపించదు.
భారత్ లో ఎక్కడ..
భారత్ లో ఈ గ్రహణం ప్రారంభం నుంచి ముగింపు వరకూ సంపూర్ణంగా కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తారు. సాయంత్రం ఆలస్యంగా ప్రారంభమై అర్థరాత్రి దాటినా తరువాత కూడా పూర్తి దశ కొనసాగుతుంది.
ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్ కతా తో సహ భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రజలకు ఆకాశం స్పష్టంగా ఈ దృశ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా దీన్ని చూడటానికి మీరు మారుమూల లేదా ఎత్తైన ప్రదేశంలో ఉండాల్సిన అవసరం లేదు.
గ్రహణం సురక్షితమేనా?
సూర్యగ్రహణాల మాదిరిగా కాకుండా చంద్రగ్రహణాలను ఎలాంటి రక్షణ లేకుండా నేరుగా చూడొచ్చు. కంటితో చూసినా లేదా టెలిస్కోప్ ద్వారా చూసినా పూర్తిగా సురక్షితం.
ఎప్పుడూ ప్రారంభం..
ఐఎస్టీ షెడ్యూల్ ప్రకారం.. గ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8:58 గంటలకు ప్రారంభం అవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11 గంటలు ప్రారంభం.. తెల్లవారుజామున 12.22 వరకూ ఉంటుంది. ఉదయం 2.25 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహాణాన్ని కొన్ని యాప్ ల ద్వారా ట్రాక్ చేయవచ్చు. స్టెల్లారియం లేదా స్కైసఫారి వంటి స్మార్ట్ ఫోన్ యాప్ లను ఉపయోగించవచ్చు.
బ్లడ్ మూన్ అనేది మూఢనమ్మకం కాదు. పూర్తిగా ఖగోళ అద్బుతం. సూర్యాస్తమయ సమయంలో కనిపించే రంగుల మాదిరిగానే భూమి వాతావరణం ద్వారా ఫిల్టర్ చేయబడిన సూర్యకాంతి నుంచి ఎర్రటి కాంతి వస్తుంది.