బైడెన్.. మీరు తప్పుకోండి: అధ్యక్షుడికి షాక్ ఇస్తున్న డెమొక్రాట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి బైడెన్ తప్పుకోవాలని సొంత పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే బైడెన్ దీనిని ఖండించారు.

Update: 2024-07-08 10:37 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలని డెమొక్రాట్ చట్ట సభ సభ్యులు డిమాండ్ చేశారు. ఐదుగురు చట్ట సభ సభ్యులైన జెర్రీ నాడ్లర్, మార్క్ టకానో, జో మోరెల్, టెడ్ లియు, ఆడమ్ స్మిత్ ఈ ప్రతిపాదన చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన తొలి డిబెట్ లో జో బైడెన్ చాలా సార్లు తడబడ్డారు. సీఎన్ఎన్ అట్లాంటాలో నిర్వహించిన ఈ డిబెట్ లో ట్రంప్ దూకుడు కొనసాగింది.

ఈ డిబెట్ లో తాను అనుకున్నంత మేర రాణించలేకపోయాయని, జో బైడెన్ సైతం అంగీకరించాడు. దీనిని పీడకల లా అభివర్ణించాడు. అయితే ఓటమిని ఒప్పుకోనని, నాలుగు సంవత్సరాల పనిని కేవలం 90 నిమిషాల చర్చల్లో ఎలా తేలుతుందని ప్రశ్నించాడు. ఈ డిబెట్ ముగిసిన తరువాత జో బైడెన్ రేటింగ్ లు దారుణంగా పడిపోయాయి.
అతని స్వంత పార్టీ అనుచరులు సైతం ఆయన ఇదే అనారోగ్యంతో దేశాన్ని మరో నాలుగేళ్ల పాటు పాలించగలరా అనే సందేహాన్ని లేవనెత్తుతున్నారు. అయితే బైడెన్ మాత్రం తన ఆరోగ్యం బాగుందని ఎన్నికల్లో నిలిచి నవంబర్ 5న జరిగే జనరల్ ఎలక్షన్ లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
"లిజనింగ్ సెషన్"
చర్చ తరువాత చట్టసభకు చెందిన మైనారిటీ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ తమ ప్రతినిధులతో ఓ సమావేశాన్ని వర్చువల్ గా ఏర్పాటు చేశాడు. ఇందులో భవిష్యత్ లో ఏర్పడబోయే రాజకీయ దృశ్యంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. బైడెన్ అభ్యర్థిత్వంపై సభ్యుల నుంచి ఇన్ పుట్ సేకరించినట్లు తెలుస్తోంది. దీనిని లిజనింగ్ సెషన్ గా న్యూయార్క్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇందులో చాలామంది డెమొక్రాట్లు బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
సాయుధ సేవల కమిటీ ర్యాంకింగ్, కాంగ్రెస్ సభ్యుడు స్మిత్ ప్రకారం, బైడెన్ వెళ్ళడానికి ఇది సరైన సమయం అని చెప్పారని దినపత్రిక తన కథనంలో పేర్కొంది. నలుగురు ఇతర కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. బైడెన్ రేసు నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమైందని వారంతా నమ్మారు. "బైడెన్‌ను తిరిగి ఎన్నిక చేయకూడదని, ఈ ఒత్తిడి చేయడానికి హౌస్ డెమోక్రటిక్ నాయకత్వంలో లియు అత్యున్నత స్థాయి వ్యక్తి" అని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
బైడెన్ కు మద్ధతు..
"ఈ పరిణామాలు అన్ని కూడా బైడెన్ కు అధ్యక్ష ఎన్నికల్లో మద్ధతు ఇస్తున్న వారిలో చీలికకు కారణమయ్యాయి. డెమొక్రాట్ ల సంఖ్య బహిరంగంగా కానీ, ప్రైవేట్ గా కానీ కనీసం పదిమందికి మించలేదని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అన్ని వ్యవస్థల్లోని డెమొక్రాట్లు చేరిపోయారని ఆ పత్రిక నివేదించింది. ఈ ప్రైమరీలు ఆయనకు సహకరించకపోవచ్చంది. అయితే బైడెన్, అతని బృందం ఈ చర్చలను తోసిపుచ్చింది. తాను అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నానని, ట్రంప్ ను ఓడిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. బిడెన్ ఆదివారం పెన్సిల్వేనియాలో జరిగిన అధ్యక్ష ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించారు . ప్రజలతో సరదాగా ముచ్చటించారు.


Tags:    

Similar News