Bangladesh | చిన్మయ్ కృష్ణ దాస్‌‌ను వెంటనే విడుదల చేయాలి: షేక్ హసీనా

ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణ దాస్‌ అరెస్టు అన్యాయమని పేర్కొన్నారు బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా. తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-11-29 08:24 GMT

ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణ దాస్‌ అరెస్టుకు బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ఖండించారు. మత స్వేచ్ఛతో పాటు అన్ని వర్గాలకు ప్రాణ, ఆస్తి భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్‌ గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో ఆయన బంగ్లాదేశ్‌ జెండానుద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో దేశద్రోహ ఆరోపణలపై ఆ దేశ పోలీసులు ఆయనను ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఛటోగ్రామ్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించి జైలులో పెట్టింది. ఈ సమయంలో దాస్ మద్దతుదారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఓ న్యాయవాది చనిపోయాడు.

‘‘బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం సారథి ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం వారు అన్ని రంగాల్లో విఫలమైంది. ధరల పెరుగుదలను నియంత్రించడంలో వైఫల్యం చెందింది. దేశ పౌరులకు భద్రత కరువైంది. ఒక న్యాయవాది తన వృత్తిపర విధుల నిర్వహణకు వెళ్ళాడు. అతనిని కొట్టి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి. యూనస్ వంద రోజుల పాలనలో దేశంలో చాలా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది అవామీ లీగ్ నాయకులు, కార్మికులు, విద్యార్థులను కూడా చంపేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు ఐక్యంగా నిలబడాలి.

ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా ఆగస్టు 5న బంగ్లాదేశ్ వీడి భారత్ చేరుకున్నారు. మూడు రోజుల తరువాత నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.

1971 లిబరేషన్ వార్ సమయంలో బంగ్లాదేశ్ జనాభాలో 22% ఉన్న హిందువులు, ఇప్పుడు దాదాపు 8% మాత్రమే ఉన్నారు. 

Tags:    

Similar News