ధోని, తన చివరి మ్యాచ్ ఆడేశాడా?

భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐపీఎల్ లో తన చివరి మ్యాచ్ ఆడేశాడా? తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎస్కే యాజమాన్యానికి చెప్పేశాడా?

Update: 2024-05-20 11:46 GMT

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడా? శనివారం బెంగళూర్ తో జరిగిన మ్యాచే ఈ లెజెండరీ కెప్టెన్ చివరి మ్యాచా.. అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో తన జట్టును ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లడంలో ధోని విఫలమయ్యాడు.

చివరి ఓవర్లో 17 పరుగులు సాధిస్తే విజయం వరించకపోయినా చెన్నై మెరుగైన రన్ రేట్ తో క్వాలిఫైయర్ లో ఆడేది. కానీ అనూహ్యంగా చివరి ఓవర్ రెండో బంతికి ధోని ఔటయ్యాడు. దీనితో జట్టు ఓటమి పాలైంది. అంతకుముందు ధోని బాదిన సిక్స్ స్టేడియం ఆవల పడటంతో బౌలర్ యశ్ దయాల్ కు కొత్త బంతిని అందించారు.

అతను అద్భుతంగా బౌలింగ్ చేసి ధోనిని పెవిలియన్ చేర్చడమే కాకుండా, మిగిలిన నాలుగు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన ఆర్సీబీని క్వాలిఫైయర్ కు తీసుకెళ్లాడు. తన జట్టును ప్లేఆఫ్స్ కు చేర్చడంలో విఫలమవడంతో ధోని తీవ్రంగా నిరాశ చెందారు. ఈ లెజెండరీ ఇప్పుడు తన చివరి మ్యాచ్ ఆడేశాడా? లేదా అనేది ఇప్పుడు స్పష్టంగా తెలియలేదు.

42 ఏళ్ల ధోని గతేడాది మాట్లాడుతూ.. 2024లో ఆడతానని చెప్పి అదే చేశాడు. కానీ, ఈ సీజన్‌లో, అతను రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించాడు. టోర్ని మొత్తం కూడా తను మరో సీజన్ లో ఆడతాడా? లేదా అనే విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. బహూశా యాజమాన్యానికి ఈ విషయం తెలియక పోవచ్చు. తెలిసిన బయట చెప్పి ఉండకపోవచ్చు.
CEO ఏమి చెప్పారు..
ధోనీ తన రిటైర్మెంట్‌పై ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. అతని నిర్ణయాలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించినప్పుడు అదే జరిగింది, అతను ఇన్‌స్టాగ్రామ్‌లో తన బూట్‌లను వేలాడదీసి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
ధోనీ ఫ్యూచర్ ప్లాన్ గురించి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియదు. "అతను మాకు ఏమీ చెప్పలేదు. అతను మాకు అలాంటి విషయాలు చెప్పడు. ధోని నిర్ణయం తీసుకుంటాడు,” అని CSK.. CEO కాశీ విశ్వనాథన్ పేర్కొన్నట్లు Cricbuzz పేర్కొంది.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, ధోని నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. 'సీఎస్‌కే నుంచి వైదొలుగుతున్నట్లు ధోనీ ఎవరికీ చెప్పలేదు. ఫైనల్ కాల్ తీసుకునే ముందు రెండు నెలల పాటు వేచి చూస్తానని యాజమాన్యానికి చెప్పాడు. అతను వికెట్ల మధ్య పరిగెత్తడంలో ఎటువంటి అసౌకర్యాన్ని అనుభవించలేదు ”అని ఒక సోర్స్ ను ఉటంకిస్తూ వార్తను ప్రచురించింది.
“ధోని కమ్యూనికేషన్ కోసం మేము వేచి ఉంటాము. అతను ఎల్లప్పుడూ జట్టు ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటాడు; ఏమి జరుగుతుందో చూద్దాం, ”అని CSK అధికారి ఒకరు తెలిపారు. అయితే వచ్చే ఏడాది ధోనీ తిరిగి వస్తాడని అంబటి రాయుడు భావిస్తున్నాడు
అయితే దీనికి భిన్నంగా ధోని తన చివరి ఐపిఎల్ గేమ్ ఆడాడని మాజీ CSK ఆటగాడు మాథ్యూ హేడెన్ భావిస్తున్నాడు. అయితే, ధోని CSK డగౌట్‌లో మెంటరింగ్ లేదా కోచింగ్ పాత్రలో ఉండవచ్చని ఆస్ట్రేలియన్ చెప్పాడు.
"నేను ఇదే అనుకుంటున్నాను. ఎంఎస్ ధోని ఆడడం ఇదే చివరిసారి అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా, MS ధోనిని చూడటం ఇది చివరిసారి కాదు. అతను అధికారిక హోదాలో CSK కుటుంబంలో మెంటర్ లేదా సభ్యుడిగా ఉండకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను, ” అని స్టార్ స్పోర్ట్స్‌లో హేడెన్ అన్నారు.
ధోనీ వచ్చే సీజన్‌లో ఆడవచ్చని మరో సీఎస్‌కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు చెప్పాడు. “ఇది అతని చివరి ఆట అని నేను అనుకోను. అతను ఈ సీజన్ తో ముగించాలని అనుకోవడం లేదని అనిపిస్తోంది. బయటికి వచ్చాక కూడా కాస్త నిరుత్సాహంగా కనిపించాడు. ఇది MS ధోనీకి భిన్నంగా ఉంటుంది,తన కెరీర్ ను ఉన్నతంగా ముగించాలని భావించి ఉంటాడు. కానీ ధోని అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటాడు ”అని రాయుడు అంటున్నారు.


Tags:    

Similar News