‘కిల్‌’: తెలుగు రీమేక్ కోసం ఇంత మంది హీరోలు, నిర్మాతలు పోటీనా?

ఓ ప్రక్కన హీరోలు మేము రీమేక్ లు చెయ్యం బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే ఓటిటిలో జనం చూసేసిన సినిమాని మళ్లీ రీమేక్ అంటూ తెరకెక్కిస్తూ ఎవరు చూస్తారని వారి కంప్లైంట్.

Update: 2024-09-04 05:32 GMT

ఓ ప్రక్కన హీరోలు మేము రీమేక్ లు చెయ్యం బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే ఓటిటిలో జనం చూసేసిన సినిమాని మళ్లీ రీమేక్ అంటూ తెరకెక్కిస్తూ ఎవరు చూస్తారని వారి కంప్లైంట్. అదీ నిజమే అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. చివరి ఆఖరకి రీసెంట్ గా రవితేజ తో హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమా రీమేక్ చేస్తే అదీ డిజాస్టర్ అయ్యింది. దాంతో రీమేక్ అంటే తెలుగులో ఉలిక్కిపడే స్టేజికి వచ్చింది. కానీ అది కొంతవరకే. ఇప్పుడు ఓ హిందీ సినిమా రీమేక్ కోసం చాలా మంది తెలుగు హీరోలు, నిర్మాతలు పోటీ పడుతున్నారంటే నమ్ముతారా.. ఆ సినిమా ఏంటో , ఆ నిర్మాతలు ఎవరో చూద్దాం.

లక్ష్‌ లాల్వానీ (Lakshya హీరో గా నిఖిల్‌ నగశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కిల్‌’. తాన్యా మనక్తిలా (Tanya Maniktala) హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ముఖ్యంగా యాక్షన్‌ ప్రియులు ఇందులో స్టంట్స్‌కు ఫిదా అయ్యారు. హిందీ వెర్షన్ ఓటిటిలో రిలీజ్ అయ్యాక అయితే ఒక్కొక్కరు నాలుగైదు సార్లు ఆ యాక్షన్ సీన్స్ ని చూసి ఆ బిట్స్ కట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ సీన్స్ ని సరికొత్తగా తీర్చిదిద్దారంటూ దర్శకుడుని మెచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ...ఈ సినిమా హాలీవుడ్ రైట్స్ అమ్ముడుపోయి మరో షాక్ ఇచ్చింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘జాన్‌ విక్‌’ను తెరకెక్కించిన దర్శకుడు ఛార్లెస్‌ ఎఫ్‌. స్టాహెల్స్కీ ఇంగ్లీష్‌ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ‘జాన్‌ విక్‌’మూవీలో యాక్షన్‌ సీన్స్ తరహాలో ఈ సినిమాలో సీన్స్ కూడా ఉంటాయనిపించి రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారట. జాన్ విక్ మూవీని తీసిన ఛార్లెస్‌ ఇందులోని స్టంట్స్‌కు ఫిదా అయ్యాడంటే అవి ఏ రేంజ్‌లో ఉన్నాయో అని అందరూ మరోసారి ఈ సినిమా చూస్తున్నారు.

తెలుగులో ఎవరు చేస్తున్నారంటే..

ఇక ఇంతమందికి నచ్చిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకోవటంలో వింతేముంది? ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కిల్‌’ రీమేక్‌ రైట్స్‌ కోసం ప్రస్తుతం అనేకమంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల్లో సుధీర్‌ బాబు (Sudheer Babu), కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అయితే ఈ సినిమా రైట్స్ తెచ్చుకుంటే డేట్స్ ఇస్తామని చెప్తున్నారని వినిపిస్తోంది. అంతేనా వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విశ్వక్​సేన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారంటున్నారు.

మరో ప్రక్క ‘కిల్’ తెలుగు రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రానాతో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. సురేష్ బాబుతో పాటు ప్రస్తుతం మహేష్,రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేస్తున్న కె.ఎల్ నారాయణ, నిర్మాత కోనేరు సత్యనారాయణ కూడా ప్రయత్నిస్తున్నారట. మరో ప్రక్క ఓ నిర్మతా అయితే ఆల్రెడీ ఓ యంగ్ హీరోకు అడ్వాన్స్ ఇచ్చి మరీ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారట. ఇలా ఇంతమంది ఈ రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ఎవరికి రైట్స్ ఇస్తారో తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకు ఓ మైనస్ ఉందంటున్నారు విశ్లేషకులు. అది తెలుగులో పూర్తి యాక్షన్‌ మూవీ అంటే వర్కవుట్‌ కాకపోవచ్చు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ జానర్‌లో వర్కవుట్ అయ్యాయి. అలాగని ‘కిల్‌’లాంటి చిత్రంలో కామెడీ, పాటలు కలిపితే కిచిడీ అయి కూర్చొంటుంది. బాలీవుడ్‌ మూవీలో ఉన్న యాక్షన్‌ ఫ్లేవర్‌ తగ్గకుండానే ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు.

ఇంతకీ చిత్రం కథేంటి?

అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్‌ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్‌ ఎక్కుతాడు. ఓ స్టేషన్‌లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.

Tags:    

Similar News