హిట్లర్ అప్పట్లోనే రూ.1500 కోట్లతో 'టైటానిక్' సినిమా తీసాడు... మరి రిజల్ట్?

టైటానిక్ కథ అప్పటికే పాతపడింది. అయినా ఆ విషాదాన్ని, ఎమోషన్ ని గుర్తుచేస్తూ నాజీ యాంగిల్ లో స్క్రీన్ ప్లే చేసి హిట్ కొట్టాలనుకున్నారు. హిట్లర్ పర్మిషన్ వచ్చింది.

Update: 2024-05-12 14:46 GMT

టైటానిక్ సినిమా గురించి తెలయని వాళ్లు లేరేమో అన్నంతగా ఆ సినిమా మన వాళ్లకు ఎక్కేసింది. నచ్చేసింది. అయితే సినిమా అనేది ప్రక్కన పెడితే ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని విషాద ప్రయాణం టైటానిక్. 1912 ఏప్రిల్ 14 వ తేదీన రాత్రి సమయంలో టైటానిక్ షిప్ సముద్రంలో ఉన్న భారీ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 1500 మంది సముద్రంలోని నీటిలో మునిగిపోయి మరణించారు.ఈ ప్రమాద ఘటన ఆధారంగా చాలా సినిమాలు 1912 నుంచి తీస్తూనే ఉన్నారు. మనం చూసి సూపర్ హిట్ చేసిన టైటానిక్ మాత్రం 1997లో విడుదలైంది. ఈ సినిమాలో దాదాపు 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతోపాటు.. అద్భుతమైన ప్రేమకావ్యం కళ్లముందుకు తీసుకువచ్చారు.

ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ అద్భుతంగా నటించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్. ఈ హాలీవుడ్ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలవటమే కాకుండా ఎన్నో ఆస్కార్ అవార్డులను అందుకుంది. అయితే 1942 లోనే హిట్లర్ ఓ టైటానికి సినిమా తీసాడు. అయితే ఆషామాషీగా చుట్టేయలేదు. జర్మన్ కరెన్సీలో 40 లక్షల బడ్జెట్ అంటే ఇప్పటికాలంలో లెక్కేస్తే 180 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,471 కోట్లు)కి సమానం. అంటే దాదాపు 1500 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీసారు. ఓ రకంగా ఇది ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ చిత్రాలలో ఒకటి. అయితే హిట్లర్ కు ఈ టైటానిక్ సినిమా ఇంత భారీ బడ్జెట్ తో తీయాలని మోజు ఎందుకు పుట్టింది..ఆ నేపధ్యం చూస్తే ...

అప్పట్లో హిట్లర్ దగ్గర జోసెఫ్ గోబెల్స్ అనే ఆయన ఉండేవాడు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతందనేగి గోబెల్స్ థీరి. ఆయన అదేపనిగా అబద్దాలని ప్రచారం చేసేవాడు. హిట్లర్ కు అనుకూలమైన అబద్దాలను జనంలోకి తీసుకెళ్లేవాడు. గోబెల్స్ నాజీల పార్టీలకు చెందిన పత్రికలకు సంపాదకుడిగా పని చేశాడు. హిట్లర్ ఒక్కడే వామ పక్షాలవాదుల నుండి, యూదుల నుండి సమస్యల నుండి గట్టెక్కించగల అవతార పురుషుడనే ప్రచారం చేయటంలో సక్సెస్ అయ్యాడు. దాంతో హిట్లర్ దగ్గర ప్రచార శాఖకు గోబెల్స్ మంత్రిగా చేశాడు. అప్పుడు అదీ ఇదీ అని తేడా లేకుండా పత్రికలు, రేడియో, నాటక రంగం, సినిమాలు, సాహిత్యం, సంగీతం, లలిత కళలు అన్ని మాధ్యమాలను వాడుకుంటూ అబద్దాస ప్రచారంతో హిట్లరును అవతార పురుషునిగా చేసే పనిలో ఉండేవాడు. అందుకోసం సినిమాలు కూడా తీసారు.

ఇక 1942 నాటికి జర్మనీ యుద్ధంలో వెనుకబడిపోతోంది. అందుకే కొత్తగా ఏదైనా ప్రచారం చేసి, సైనికులను, ప్రజలను నమ్మించి, ఉత్తేజపరుస్తూ ముందుకు దూసుకెళ్లాలని గోబెల్స్ భావించాడు. అప్పుడే 'కాసబ్లాంకా' సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఫాసిస్ట్ వ్యతిరేక కథనంతో వచ్చిన ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ నాజీలకు కూడా నచ్చేస్తోంది. ఆ సినిమాకు కౌంటర్ గా ఓ సినిమా చేయాలి. అదీ జనాలకు తెలుసున్న కథనంతో అయితే ఇంకా బాగా నమ్మించవచ్చు . ఆ ఆలోచనల నుంచి పుట్టిందే టైటానిక్. ఈ టైటానిక్ కథ అప్పటికే పాతపడింది. అయినా మళ్లీ ఓ సారి ఆ విషాదాన్ని, ఎమోషన్ ని గుర్తు చుస్తూ నాజీ యాంగిల్ లో స్క్రీన్ ప్లే చేసి హిట్ కొట్టాలనుకున్నారు. హిట్లర్ పర్మిషన్ వచ్చింది.

అంతే డబ్బులు నీళ్లలా ఖర్చుపెడుతూ..భారీగా సినిమా తీసారు. టైటానిక్ నమూనా షిప్ క్యాప్ ఆర్కోనా ని తయారు చేసారు. ఇక స్క్రిప్టులో కొంత యాంగిల్ ఏమిటి అంటే... బ్రిటన్, అమెరికాల దురాశ వల్లే టైటానిక్ ప్రమాదం జరిగినట్లు రాసి చిత్రీకరించారు. నిజానికి యుద్ద సమయంలో అంత బడ్జెట్ పెట్టి సినిమా తీయటం అంటే మాటలు కాదు..కానీ ఆ సినిమా మీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు. అలాగే యుద్దం చేసే జర్మన్ సైనికులను తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లుగా వాడారు.

ఎలాగో బెదిరించో బ్రతిమాలో...అప్పటి స్టార్ జర్మన్ యాక్టర్స్ ని సీన్ లోకి తెచ్చారు. అయితే యుద్దం జరుగుతున్న సమయంలో కావటంతో పూర్తిగా ఈ సినిమాపై కాన్సర్టేట్ చేయలేకపోయారు. మరో ప్రక్క జూనియర్ ఆర్టిస్ట్ లుగా వచ్చిన సైనికులు.. మహిళా ఆర్టిస్ట్ లను ఇబ్బంది పెట్టేవారు. డైరక్టర్ హెర్బర్ట్ సెల్పిన్‌ ని తన పని తాను సరిగ్గా చేయనివ్వకుండా అన్నిటిలోనూ నాజీ అధికారులు వేలు పెట్టేవారు. దాంతో ఆ గొడవులు. చివరకు డైరక్టర్ ని అరెస్ట్ చేసి గోబెల్స్ ముందు ప్రవేశపెట్టి విచారణ చేయటం.ఇలా గందరగోళంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టినా సినిమాని మాత్రం అస్తవ్యస్తంగా తగలపెట్టారు. ఆ డైరక్టర్ ని ఎంత వేధించారంటే ఆయన ఉరేసుకుని చనిపోయాడు.

ఇక గోబెల్స్ స్వయంగా ఈ సినిమా కథ రాయించాడు. ఆ కథలో టైటానిక్ ఓనర్స్ బ్రిటిష్ వాళ్లు. వాళ్ల దురాశ ఫలితంగా టైటానిక్ మునిగిపోయింది. అప్పటికి ఆ మునిగిపోయే సమయంలో నౌక సిబ్బందిలో ఉన్న ఒక జర్మనీ దేశం వ్యక్తి మంచు కొండను గుద్దనివ్వకుండా చాలా ప్రయత్నం చేసాడు. ఆ ఓడ స్పీడుని తగ్గించటానికి ప్రయత్నంచాడు. అయితే ఆ ఓడ యజమానులైన బ్రిటీష్ వారు ఒప్పుకోకుండా చేసిన తప్పు వల్ల 1500 మంది జనం చనిపోయారు.

అయితే స్క్రిప్టులో రాసుకున్న విషయం...సినిమాగా చూసేటప్పటికి గోబుల్స్ కే కంగారు పుట్టింది. అదేమిటంటే.. ఓడ సిబ్బంది అయిన జర్మన్ ఆఫీసర్ తన పై అధికారుల మాట వినడు. బ్రిటీష్ వాళ్లు అనైతికంగా ప్రవర్తిస్తునారని చెప్తూ..వాళ్ల అధికార్ల ఆదేశాలు పాటించడు. అది చూసి జర్మన్ లు అంతా జై కొడతారని స్క్రిప్టు రాసుకున్నప్పుడు భావించారు. కానీ సినిమా చూస్తుంటే..ఇప్పుడు నిజంగానే సందేశం జర్మన్ ఆఫీసర్లు ఈ సినిమా చూసి అలా బిహేవ్ చేసి...తమ పై అధికారులు చెప్పిన మాట వినకపోతే ఏంటి పరిస్దితి అనే భయం పట్టుకుంది. దాంతో అనుకున్న స్దాయిలో రిలీజ్ చేయలేదు. మరో ప్రక్కన చూసిన వాళ్లు కనెక్ట్ కాలేదు.

టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉంది కానీ గొప్పగా లేదని పెదవి విరిచి సినిమాని ప్లాఫ్ చేసారు. ఇది జర్మనీలో అప్పడున్న పరిస్దితిని అద్దం పడుతోందని మరికొందరు వ్యాఖ్యానించారు. టైటానిక్ ఓడలో జనం ఓ తెలివి తక్కువ అధికారి నిర్ణయాల వల్ల అర్దం లేని మరణం పొందారని... అలాగే జర్మన్స్ కూడా హిట్లర్ అనే తెలివి తక్కువ నాయకుడు నిర్ణయాల వల్ల మునిగిపోతున్నారని పోల్చటం మొదలెట్టారు. ఏదైమైనా సినిమా అంటే కేవలం డబ్బులు పెట్టడం కాదు, ‘అదొక సృజనాత్మక ప్రక్రియ, అనుభూతి.. అనుభవం, ప్రేరణ, ఉద్వేగం.. ఇది కళ, ఇది జీవితం! సరైన సినిమా లో ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నిటినీ ఆస్వాదిస్తాము.

Tags:    

Similar News