“హీరోల భారీ రెమ్యూనరేషన్ రోజులు ముగిశాయా?”

తమిళ నిర్మాతల మండలి బాంబ్‌షెల్!

Update: 2025-11-10 06:55 GMT

తమిళ సినీ పరిశ్రమలో వరుస ఫ్లాప్‌లు నిర్మాతల మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. కొందరు నిర్మాతలు దివాళా తీయగా, మరికొందరి నెక్ట్స్ సినిమాలు ఆగిపోయి, ముందుకు కొనసాగించలేని స్థితికి చేరుకున్నారు. కానీ హీరోల రేమ్యూనరేషన్ మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా తగ్గేదేలే అన్నట్లు హీరోలు వ్యవహిస్తున్నారు. వాళ్లకు ఫుల్ పేమెంట్ క్లిరర్ చేయాల్సివస్తోంది. ఈ క్రమంలో నిర్మాతకు ఎటుచూసినా అప్పులు,ఫ్లాఫ్ లే కనపడుతున్నాయి! ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే భవిష్యత్తులో నిర్మాత అనే వాడు ఉండజు అని ఇప్పుడు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) గట్టి నిర్ణయం తీసుకుంది.

“లాభం మాత్రమే కాదు, నష్టమూ పంచుకోవాలి” – TFPC కొత్త నిబంధన

ఇకపై పెద్ద సినిమాలు చేయాలంటే స్టార్ హీరోలు, టాప్ టెక్నీషియన్లు ప్రాఫిట్ షేరింగ్ మోడల్లోనే పని చేయాలని TFPC స్పష్టం చేసింది. సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా, ఫ్లాప్ అయితే నష్టంలో భాగస్వామ్యం — ఇదే కొత్త సమీకరణం!

ఈ నిర్ణయం నిర్మాతల కోణంలో చూస్తే ధైర్యం ఇచ్చే మార్పు. నిర్మాతలపై పడుతున్న భారం తగ్గే అవకాశం ఉంది. కానీ మరోవైపు చూస్తే — పెద్ద స్టార్‌లు ఇలాంటి కఠిన షరతుల వలన కొత్త సినిమాలకి “వెయిట్ & వాచ్” మోడ్లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

థియేటర్లు, OTTలు… అన్ని వైపులా తగ్గిన రెవెన్యూ

TFPC ప్రకారం, థియేటర్ కలెక్షన్లు, OTT డీల్స్ రెండూ గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో, “ఒక్క నిర్మాత మాత్రమే నష్టాన్ని మోయకూడదు” అన్న భావనతోనే ఈ పాలసీని రూపొందించారు. అలాగే ఇకపై థియేట్రికల్ రిలీజ్‌కి ఎనిమిది వారాల తర్వాతే OTT రిలీజ్ అనుమతించాలన్న కొత్త నిబంధనను కూడా ప్రకటించారు.

చిన్న సినిమాలకు కొత్త గాలి — రిలీజ్ రెగ్యులేషన్ కమిటీ

TFPC చిన్న, మధ్యస్థాయి సినిమాల కోసం ఫిల్మ్ రిలీజ్ రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం తమిళంలో 250కి పైగా సినిమాలు వస్తున్న నేపథ్యంలో, చిన్న చిత్రాలకు సరైన థియేట్రికల్ విండో ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం అని TFPC వెల్లడించింది. అలాగే థియేట్రికల్ రిలీజ్‌కి ఎనిమిది వారాలు గడిచిన తర్వాతే OTT రిలీజ్ అనుమతించాలి అని కూడా కొత్త రూల్ ని ప్రతీ నిర్మాత ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంది.

అదే కాదు — చిన్న, మధ్యస్థాయి చిత్రాలకు సరైన థియేట్రికల్ రిలీజ్ లభించేలా ఫిల్మ్ రిలీజ్ రెగ్యులేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో, ఈ కమిటీ రూల్స్ గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయని ఇండస్ట్రీ టాక్.

యూట్యూబ్ ఛానెల్స్‌పై హెచ్చరిక – “హద్దులు దాటొద్దు!”

TFPC, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ కలిసి — కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ హద్దులు దాటుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇకపై తప్పుడు ప్రచారం, పర్సనల్ అటాక్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.

స్టార్ హీరోల రియాక్షన్‌పై ఆసక్తి

ఇంత కఠినమైన “ప్రాఫిట్ షేరింగ్” నియమం ప్రకటించిన తర్వాత, స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడు కోలీవుడ్‌లో అంతటా చర్చనీయాంశంగా మారింది.

చూడాలి మరి "హీరోల రేమ్యూనరేషన్ యుగం ముగుస్తుందా?" అనేది ఇప్పుడు కేవలం తమిళ పరిశ్రమలోనే కాదు తెలుగు పరిశ్రమలోనూ హాట్ టాపిక్! అయితే ఎంతవరకూ నిర్మాతలు ఈ రూల్స్ ని అమలు చేస్తారు అనేది కూడా పెద్ద క్వచ్చినే. గతంలోనూ చాలా సార్లు ఇలా రూల్స్ పెట్టి తామే అతిక్రమించిన చరిత్రం నిర్మాతలకు ఉండటం ఈ సమయంలో గుర్తు చేసుకోవాలి.

Tags:    

Similar News