మూడు భారీ ప్రాజెక్టులతో తెలుగు సినిమా గ్లోబల్ గర్జన!

తెలుగు సినిమా రూపం మారుతోంది. కేవలం ప్రాంతీయంగా కాదు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించేందుకు.;

Update: 2025-06-30 10:30 GMT

‘‘Cinema is not just a product; it’s a cultural export.” 

 ఇన్నాళ్లూ కేవలం సినిమా వేదికల మీద చెప్పుకునే ఈ మాటలు ఇప్పుడూ నిజమవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ‘రీజినల్’ అనే వర్గీకరణలో ఉన్నా, ఇప్పుడు అది ప్రపంచ మార్కెట్ లో పెట్టుబడి పెట్టదగ్గ బ్రాండ్ అవుతోంది. 2027లో విడుదల కాబోతున్న మూడు భారీ సినిమాలు – SSMB29, AA22, Spirit – ఈ వాస్తవాన్ని మన ముందు ఉంచనున్నాయి.

తెలుగు సినిమా... 'బాహుబలి' మొదలు 'RRR' వరకూ గ్లోబుల్ మార్కెట్ లో విజయం సాధించిన తర్వాత థైర్యం తెచ్చుకుంది. ఇప్పుడు మరింత ముందుకు దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు క్లారిటీగా టాలీవుడ్ పెద్ద సినిమాల టార్గెట్ – గ్లోబల్ ఆడియెన్స్. ఈ దిశగా షూటింగ్ మొదలైన మూడు బిగ్ ప్రాజెక్టులు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

SSMB29, AA22, Spirit. ఇవి మూడు కేవలం తెలుగు చిత్రాలు కావు... ఇవి భారతీయ సినిమా కొత్త దిశగా వెళ్లే మార్గదర్శకాలు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ మార్కెట్ టార్గెట్, ప్రపంచ స్థాయి మేకింగ్ – ఇవన్నీ కలసి 2027ను టాలీవుడ్‌కు మరో గేమ్-చేంజింగ్ ఏడాదిగా మార్చబోతున్నాయి. ఈ క్రమంలో బిజినెస్ యాంగిల్ లో ఈ సినిమాలకు వరల్డ్ సినిమా మార్కెట్ ఏ విధంగా ప్లస్ కాబోతోందో చూద్దాం.

SSMB29 - మహేష్ బాబు x రాజమౌళి: Indian Cinema’s Biggest Adventure Begins

SS రాజమౌళి "RRR"తో ప్రపంచానికి నెపొలియన్ స్టైల్ మెసేజ్ ఇచ్చాడు — “Indian cinema is not just Bollywood!” ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి తీసే SSMB29 సినిమాతో, ఆయన అంతకంటే పెద్ద మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇది అడ్వెంచర్ జానర్ లో వండర్‌గా రూపొందుతోందన్న బజ్ ఉంది. SSMB29... ఈ కోడ్ ఇప్పటికే గ్లోబల్ ఫిల్మ్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది.

బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ట్రేడ్ చెప్తోంది ఒకటే మాట: “Adventure is the most exported genre after action in world cinema. Rajamouli understands that.”

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌లో ఉంది. మ్యూజిక్, లొకేషన్స్, స్కేల్ అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటాయి.

AA22 - అల్లు అర్జున్ x అట్లీ: Commercial Fireworks on Global Screens

ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాల్లో ఒకటి. అట్లీ మార్కు మాస్ స్టోరీ టెల్లింగ్, అల్లు అర్జున్ స్టైల్... ఈ కాంబినేషన్ ఏం రేంజిలో హంగామా చేస్తుందో ఊహించుకోండి! విజువల్ డెప్త్, టెక్నికల్ టీమ్ – అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో సిద్ధమవుతున్నాయి.

బిజినెస్ పాయింట్:

"స్టార్ పవర్ + మాస్ కంటెంట్ = గ్యారెంటీడ్ ఇంటర్నేషనల్ అప్పీల్. ఆ విధంగా 'జైలర్' వంటి తమిళ చిత్రాలు, 'పుష్ప' వంటి తెలుగు చిత్రాలు ఆఫ్రికా, రష్యా తో పాటు అనేక ఆగ్నేయాసియాలో వర్కవుట్ అయ్యాయి."

జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. 2027లో ఈ సినిమా టికెట్లు జపాన్ నుంచీ, కెనడా వరకు బుక్ అవుతాయనడంలో సందేహమే లేదు.

Spirit - ప్రభాస్ x సందీప్ వంగా: A Violent Global Saga

అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి ఎమోషనల్ ఇన్‌టెన్సిటీ సినిమాలతో గుర్తింపు పొందిన సందీప్ వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరి కలయికలో ఓ కొత్త తరహా పోలీస్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది.

ప్రభాస్ క్రేజ్ + పాన్-వర్డ్ హైప్ + సందీప్ వంగా టేకింగ్ + ఇంటెన్స్ హ్యూమన్ ఎమోషన్ + డార్క్ యాక్షన్. ఈ కాంబినేషన్‌లో తీసే Spirit సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. సెప్టెంబర్‌లో షూట్ మొదలవుతుంది.

బిజినెస్ పాయింట్: “Violence and raw emotion travel beyond language.”

ప్రభాస్ గ్లోబల్ ఫేస్. వంగా ఇంటెన్సిటీ. Spirit ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే సినిమా అవుతుంది!

ఈ మూడు సినిమాలు ఫాలో అవుతున్న స్ట్రాటజీ :

ప్రాంతీయ భాష... ప్రపంచ ఆలోచన.

లోకల్ సోల్... యూనివర్సల్ స్టోరీ టెల్లింగ్.

తెలుగు కంటెంట్... గ్లోబుల్ సెల్లింగ్

“Made in Telugu. Designed for the World.”

మూడు వేర్వేరు స్టైల్‌లలో, మూడు ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాలు.. వర్కవుట్ అయితే భారతీయ సినిమా భవిష్యత్తుకి రోడ్‌మ్యాప్ లా మారతాయనటంలో సందేహం లేదు. ఏదైమైనా 2027లో తెలుగు సినిమాల ద్వారా ఇండియన్ సినిమా మరో స్టెప్ ఎగబాకుతుంది.

Tags:    

Similar News