సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో నిందితుడి అరెస్టు..

నటుడు సల్మాన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు తాజా కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కూడా చేశారు.

Update: 2024-06-16 10:33 GMT

ఏప్రిల్‌లో నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు తాజా కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కూడా చేశారు. నిందితుడిని రాజస్థాన్‌లోని బుండీకి చెందిన బన్వరీలాల్ లతుర్‌లాల్ గుజార్ (25)గా గుర్తించినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.

సల్మాన్‌ను చంపేస్తా..

"లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ఇతర ముఠా సభ్యులు నాతో ఉన్నారు. క్షమాపణలు చెప్పనందుకు నేను సల్మాన్ ఖాన్‌ను చంపబోతున్నాను" అని గుర్జర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు అని అధికారి తెలిపారు.

‘‘రాజస్థాన్‌లోని ఓ హైవేపై నిందితుడు వీడియో తీసి తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. కేసు తీవ్రత దృష్ట్యా రాజస్థాన్‌కు ఒక పోలీసుల బృందాన్ని పంపి నిందితుడిని పట్టుకున్నాం. అతడికి నేర నేపథ్యం ఉందా లేదా అని పరిశీలిస్తున్నాం. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం’’ అని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ తెలిపారు.

ఘటన ఎప్పుడు జరిగింది?

ముంబై బాంద్రా ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఇద్దరు మోటార్‌బైక్‌పై వచ్చిన పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఏప్రిల్ 14 తెల్లవారుజామున జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ మే 1న పోలీసు లాకప్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కేసులో హర్యానాకు చెందిన బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లకు చెందిన వ్యక్తితో సహా ఐదుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారని, ఆయన కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్న సల్మాన్ సోదరుడు అన్మోల్‌ను కాల్పుల కేసులో నిందితుడిగా చూపారు పోలీసులు.

Tags:    

Similar News