వావ్... చెల్లి పెళ్లిలో సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్, ఆ స్టెప్స్ చూసి తీరాల్సిందే

నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం ఈ రోజు అదిరిపోయే రీతిలో జరిగింది. కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో జరిగింది.

Update: 2024-09-05 11:53 GMT

నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ వివాహం ఈ రోజు అదిరిపోయే రీతిలో జరిగింది. కోటగిరిలో పడుకర్ కుల పద్ధతిలో జరిగింది. సాయి పల్లవి దగ్గరుండి తన చెల్లెలు పెళ్లిని నిర్వహించింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు.

ఈ వివాహ ఫోటోలు,వీడియోలు బయటకు వచ్చి అబిమానులను అలరిస్తున్నాయి. ఈ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ ..ఎవరు అవునన్నా కాదన్నా సాయి పల్లవే. ఇక ఈ పెళ్లి వేడుక‌లో చెల్లి పూజా కన్నన్‌తో క‌లిసి సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చేసింది.

మ‌రాఠీ పాపులర్ సాంగ్ అప్స‌ర అలీ పాట‌కు వీళ్లిద్ద‌రు డ్యాన్స్ చేస్తే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డాన్స్ చూసిన వాళ్లు రెండు కళ్లు చాలవు అంటున్నారు. అసలే సాయి పల్లవి ప్రొఫిషనల్ డాన్సర్. అందుకు తగినట్లు గా సినీ గ్లామర్ తోడు. ఈ వీడియోలో ఆమె గమనిస్తే ఒకసాని కిందపడబోయింది. వెంటనే సర్దుకుని మళ్లీ లేచి డ్యాన్సలో గ్యాప్ లేకుండా కలసిపోయింది. అదరహో అనిపించింది.

నటి సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కూడా మంచి డాన్సర్. ఆమె కూడా ఒక సినిమాలో హీరోయిన్‌గా కూడా నటించింది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన చిత్రై సెవ్వనం సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా కన్నన్ తన అక్క స్థాయికి తగ్గట్టుగా క్రేజ్ రాకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంది. ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి మేనేజర్‌గా ఉంటోంది పూజ.

ఇక సాయి ప‌ల్ల‌వి సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ చైత‌న్య‌తో తండేల్ అనే సినిమాలో న‌టిస్తుంది. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు.

Tags:    

Similar News