రేవంత్–సల్మాన్ సీక్రెట్ మీటింగ్!
కాంగ్రెస్ గేమ్ లేదా ఇమేజ్ స్టంట్?
కొన్ని విషయాలు హఠాత్తుగా మీడియాలో వచ్చి హైలెట్ అవుతూంటాయి. అప్పటిదాకా ఊహించైనా ఊహించనివి రాజకీయాల్లో జరుగుతూంమటాయి. అలాంటిదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లిన విషయం . ఇది ఒక్కరికీ కూడా తెలియలేదు. ఏ అధికారిక షెడ్యూల్ లేదు, అనౌన్స్‌మెంట్ లేదు. కానీ అకస్మాత్తుగా—సల్మాన్ ఖాన్ ఇంట్లో రేవంత్‌తో దిగిన ఫోటో బయటకు వచ్చింది! ఒక్క ఫోటోతోనే తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది.
సాధారణంగా అధికారిక ట్రిప్ అయితే మీడియాకు సమాచారం తప్పదు. అయినా ఈసారి? సీక్రెట్ ట్రావెల్, స్ట్రైట్ టు సల్మాన్ హౌస్! ఎందుకు వెళ్లారు? ఏం మాట్లాడుకున్నారు? ఏ అజెండా? ప్రస్తుతం ఇవే మిలియన్ డాలర్ ప్రశ్నలు.
మైనార్టీ ఓటర్ల కోసం ప్లాన్?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మైనార్టీ వోట్ల ప్రభావం నిర్ణయాత్మకం. సల్మాన్ ఖాన్‌కు యువతలోనూ, ముస్లింలలోనూ పెద్ద క్రేజ్ ఉంది.
అందుకేనా ఈ మీటింగ్?
అలా అయితే…ఈ ఫోటో ఒక్కటే క్యాంపెయిన్ షాట్‌గా సరిపోతుందా అని కాంగ్రెస్ నేతల ప్రశ్న? కానీ ట్విస్ట్ ఏమిటంటే—సల్మాన్ ఖాన్ ఎక్కడా కాంగ్రెస్‌కు సపోర్ట్ అనలేదు. కేవలం హాయ్-హలో, ఫోటో—అంతే.
బీఆర్ఎస్ మోత కాస్త జోరు!
ఈ ఫోటో వైరల్ చేసింది కాంగ్రెస్ కాదు…బీఆర్ఎసే! “రాష్ట్రం వరదలతో కష్టాల్లో ఉంది, సీఎం మాత్రం సల్మాన్ ఇంట్లో పిక్చర్స్” అంటూ అటాక్ చేస్తున్నారు. గమనించదగిన విషయం—బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రచారం…కాంగ్రెస్‌కే పరోక్షంగా రీచ్ ఇస్తుందా? అంటే.. రేవంత్ మైనార్టీ కార్డ్ ఆడితే, దాన్ని హైలైట్ చేస్తోంది బీఆర్ఎస్!
నిజం ఏంటి?
ఒక ముఖ్యమంత్రి…అది కూడా ఆపదకాలంలో…దూరంగా ముంబైకి వెళ్లి, ఇండియా టాప్ స్టార్ ఇంట్లో గెస్టుగా ఫోటో తీసుకోవడం—ఇది చిన్న విషయం కాదు. అయితే అసలు టాక్స్, టార్గెట్స్, టాక్టిక్స్ ఏంటో… రేవంత్ & సల్మాన్ కి మాత్రమే తెలుసు. బయటి ప్రపంచం మాత్రం ఊహల్లొ, మీమ్స్ లో మునిగిపోతుంది!