థియేటర్స్ క్లోజ్ కు మూల కారణం చెప్పిన 'దేవి' థియేటర్ ఓనర్

ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటమే కారణమా? లేక థియేటర్స్ మూసేయడానికి మరేదైనా కారణముందా? హైదరాబాద్ దేవి థియేటర్ ఓనర్ ఏం చెబుతున్నారంటే...

Update: 2024-05-17 07:56 GMT

తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు ఆపేయాలని నిర్ణయించుకోవటం సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకపోవడం, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తుందని థియేటర్ల ఓనర్లు ప్రకటించారు. గత కొన్నాళ్లుగా థియేటర్లలో ఆక్యుపెన్సీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోతున్నారు. అయితే కేవలం అదొక్కటే కారణమా.. లేక వేరే సమస్యలు ఉన్నాయా అనేది హైదరాబాద్ దేవి థియేటర్ ఓనర్ తాడ్ల బాల్ గోవింద్ రాజ్ మాటల్లో తెలుసుకుందాం.

దేవి థియేటర్ యజమాని మాట్లాడుతూ... ఇలా థియేటర్స్ మూసే పరిస్థితి రావటం బాధాకరం. ప్రతీ సమ్మర్ కి ఎంటర్టైన్మెంట్ మూవీస్ వచ్చి మనల్ని అలరించేవి. అయితే ఈ సారి గ్యాప్ వచ్చింది. అందుకు మెయిన్ కారణం ఎలక్షన్స్. నిజానికి ఎలక్షన్స్ లేకపోతే ప్రభాస్ కల్కి, ఇండియన్ 2 (కమల్ హాసన్), లవ్ మి.. మూడు సినిమాలు రావాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలలలో ఈ సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి కానీ ఎలక్షన్స్ వల్ల అవి పోస్ట్ పోన్ అయ్యి.. గ్యాప్ ఏర్పడి సినిమాలు లేక కంపౌండింగ్ ఎఫెక్ట్ అయ్యింది.

కంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే... కల్కి లాంటి పెద్ద సినిమా వస్తుంది కదా అని మిగతా సినిమాలు ఏమీ రావు. కల్కి సినిమా ఎలక్షన్స్ వల్ల రాలేదు. దాంతో గ్యాప్ ఏర్పడి సింగిల్ స్క్రీన్స్ బంద్ చేయాల్సిన పరిస్దితి వచ్చింది. కేవలం ఈ ఇంపాక్ట్ సింగిల్ స్క్రీన్స్ కు మాత్రమే కాదు. మల్టిప్లెక్స్ లకు కూడా ఉంది. అలాగని మొత్తం థియేటర్స్ క్లోజ్ చేయటం లేదు. సిటీలో డెబ్భై ఎనభై థియేటర్స్ నడుస్తున్నాయి. ప్రతినిధి 2, కింగ్ డమ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, దర్శిని అనే కొత్త సినిమా వచ్చింది. పేపర్లో చూస్తే కొన్ని థియేటర్స్ లో సినిమాలు ఉన్నాయి. కాకపోతే అన్ని థియేటర్స్ కు సరిపడా సినిమాలు లేవు.

అయితే అసలు సమస్య మరొకటి ఉంది. అది ఎప్పటి నుంచో ఫిల్మ్ ఛాంబర్ వారికి కూడా చెప్తున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం. మల్టిప్లెక్స్ లకు ఇచ్చే షేర్ పర్శంటేజ్ మాకు కూడా ఇవ్వండని అడుగుతున్నాము. మల్టిప్లెక్స్ లకు 40% నుంచి 50% దాకా రెవిన్యూ షేర్ ఉంటుంది. అంటే సినిమా కలెక్షన్స్ లో నలభై శాతం అయినా మల్టిప్లెక్స్ లకు వెళుతుంది. అదే మా సింగిల్ స్క్రీన్స్ కు వచ్చేసరికి 10% కన్నా తక్కువ ఉంటోంది. అంటే ఇరవై లక్షల కలెక్షన్స్ వస్తే మాకు ఇరవై వేలు కూడా ఇవ్వరు. మొత్తం తీసేసుకుంటారు. ఈ పరిస్థితి మారాలి. అప్పుడు మాత్రమే సింగిల్ స్క్రీన్స్ బ్రతికి బట్టకడతాయి.

మీకు చూస్తే అర్ధమవుతుంది. ఒకదాని తర్వాత మరొక సింగిల్ స్క్రీన్ క్లోజ్ అయ్యిపోతోంది. ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంతో ఇంప్రూవ్ అయ్యింది కదా. ఆ వ్యత్యాసం సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి నిర్మాతలు గమనించాలి.

ఇక గుంటూరు కారం, అల వైకుంఠపురంలో... ఇలాంటి పెద్ద స్టార్స్ సినిమా వస్తేనే మార్కెట్ లో కదలిక ఉంటుంది. జనాలు లక్షల్లో వచ్చి ఎంజాయ్ చేస్తారు. అయితే పెద్ద స్టార్స్ తమ భారీ సినిమాలు చేయటం కోసం రెండు మూడేళ్లు పడుతోంది. దాంతో పెద్ద స్టార్స్ సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అది బాధాకరమే కానీ క్వాలిటీ వైపు నుంచి ఆలోచిస్తే ఆ స్థాయి సినిమాలకు ఆ సమయం అవసరం. ఏదో రకంగా చుట్టేయలేరు కదా. అలా సంతోషపడుతున్నాం కానీ మాకు సినిమాలు లేక మావైపు నుంచి డామేజ్ కనపడుతోంది.

వాళ్ళు కూడా నిర్మాతలు అందరూ కూర్చుని ఓ క్యాలెండర్ పెట్టుకుని ఫలానా టైమ్ కు ఫలానా పెద్ద సినిమా అని ప్లాన్ చేసుకుంటారు. కానీ అనివార్య కారణాలు, క్వాలిటీ ఓరియెంటెడ్ టాపిక్స్ తో ఆ ప్లానింగ్ తప్పుతూంటుంది. పెద్ద హీరోలకు ఓ సారి ఈ విషయమై ఓ సారి రిక్వెస్ట్ చేస్తాము. అయినా ఇది వాళ్ల స్వేచ్ఛకు సంబంధించింది. మనం ఏమీ మాట్లాడలేం.

ఇక మొదటి నుంచి మల్టీప్లెక్స్‌ లో సినిమాలపై వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు షేర్ ఉంటుంది. అదే సింగిల్‌ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారు. దాంతో అద్దెలు పెంచమని కూడా చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అదీ జరగటం లేదు. ఇప్పుడు మల్టిప్లెక్స్ లతో సమానంగా షేర్ ఇవ్వమని అంటున్నారు.

మే 17 నుంచి తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా కొన్ని ద్వితియ శ్రేణి నగరాల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేస్తున్నారు. దాదాపు 10 రోజులు పాటు ధియేటర్లను బంద్ చేయనున్నట్టు తెలంగాణా ఎగ్జిబిటర్ కౌన్సిల్ తెలిపింది . ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రాలో 12 వందల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. మరి అక్కడ మూసేస్తారా లేదా అనేది ఎగ్జిబిటర్లు చర్చించనున్నట్టు తెలుస్తుంది.

ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు.. పెద్ద సినిమా మీద వచ్చే రెవిన్యూతోనే మల్టిప్లెక్స్ లు బ్రతుకుతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా అదే బెనిఫిట్ వచ్చేలా చేయాలనేది మా ఆశ అంటూ ముగించారు.

ఏదైమైనా దేవి థియేటర్ యజమాని చెప్పినట్లు... మల్టిప్లెక్స్ లతో సమానంగా... రెవిన్యూ షేర్ ని సింగిల్ స్క్రీన్స్ కి కూడా ఇచ్చినప్పుడు మాత్రమే చాలా వరకూ ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది ఇండస్ట్రీ పెద్దలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.

ఇక మొదటి నుంచి మల్టీప్లెక్స్‌లో సినిమాలపై వచ్చే ఆదాయంపై పర్సెంటేజీ రూపంలో లాభాలు షేర్ ఉంటుంది. అదే సింగిల్‌ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారు. దాంతో అద్దెలు పెంచమని కూడా చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అదీ జరగటం లేదు. ఇప్పుడు మల్టిప్లెక్స్ లతో సమానంగా షేర్ ఇవ్వమని అంటున్నారు.

మే 17 నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా కొన్ని ద్వితీయ శ్రేణి నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు థియేటర్లను బంద్ చేయనున్నట్టు తెలంగాణ ఎగ్జిబిటర్ కౌన్సిల్ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రాలో 12 వందల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. మరి అక్కడ మూసేస్తారా లేదా అనేది ఎగ్జిబిటర్లు చర్చించనున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News