నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ముహూర్తం ఫిక్స్, పెళ్లి ఎప్పుడంటే..

రాజకీయ వివాదంలో చిక్కుకున్న అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజాలు త్వరలో మోగనున్నాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

Update: 2024-10-31 08:27 GMT
అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య పెళ్లి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4న నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహం జరుగనుంది. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు. శోభిత కూడా సినీరంగానికి చెందిన వారే. అక్కినేని కుటుంబం ఇటీవలి కాలంలో రాజకీయ వివాదంలో చిక్కుకుంది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు నాగచైతన్య- సమంత విడాకుల విషయాన్ని ఓ రాజకీయ నాయకునితో ముడిపెట్టి మాట్లాడడం, ఆ తర్వాత అది వివాదం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 8న నాగచైతన్య- శోభితల నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఆ సమయంలో పెళ్లి తేదీని ప్రకటించలేదు. వివాహం ఎప్పుడు ఉంటుందా? అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో వివాహ తేదీని ఖరారు చేశారు. డిసెంబరు 4న నాగచైతన్య-శోభితల వివాహం ఉంటుందని ధ్రువీకరించారు.
వారం రోజుల కిందట శోభిత తన ఇన్‌స్టా వేదికగా ‘గోధుమ రాయి పసుపు దంచటం.. ఇక ఆరంభమైంది’ అంటూ పెళ్లి పనులు మొదలు పెట్టేసినట్లు ప్రకటించారు. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. దీంతో అధికారికంగా చెప్పకపోయినా, త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగా మరో 35 రోజుల్లో ఈ జోడీ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. అయితే, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? హైదరాబాద్‌లోనే చేసుకుంటారా? అన్నది చెప్పలేదు.
ఎవరీ ధూళిపాళ్ల శోభిత..
శోభితా ధూళిపాళ్ల 1992 మే 31న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విశాఖపట్నంలో పెరిగారు. తండ్రి వేణుగోపాలరావు. మర్చంట్ నేవీ ఇంజనీర్. తల్లి శాంతా కామాక్షి. ఎలిమెంటరీ స్కూలు టీచర్. పదహారేళ్ల వయసులో తనంతట తానుగా ముంబైకి వెళ్లారు. ముంబై విశ్వవిద్యాలయంలో కార్పొరేట్ లా చదివారు. కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందారు. 2010లో నేవీ క్వీన్‌గా ఎంపికయ్యారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొని టైటిల్ గెలిచారు. అదే ఏడాది భారతదేశం తరఫున మిస్ ఎర్త్ -2013 పోటీలో పాల్గొన్నారు. 2016లో తొలిసారి సినిమారంగ ప్రవేశం చేశారు.
Tags:    

Similar News