‘అఖండ 2’కి లాస్ట్ మినిట్ ట్విస్ట్,కరుణించని కోర్ట్ తీర్పు!

దెబ్బ కొడుతుందా?

Update: 2025-12-11 11:06 GMT

 ఇబ్బందులు, వాయిదాలు, కోర్టు కేసులు… ఇవన్నీ దాటి ఎట్టకేలకు డిసెంబర్ 11న ప్రీమియర్స్, 12న గ్రాండ్ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. బాలయ్య ఫ్యాన్స్ ఈ నిర్ణయంతో ఊహించలేని ఆనందంలో ఉన్నారు. ఏపీలో ఇప్పటికే బుకింగ్స్ దుమ్ములేపుతున్నాయి. తెలంగాణలో మాత్రం కౌంటర్లు లేటుగా ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

థియేటర్ల దగ్గర సైలెన్స్ లేదు… అయితే ఆగి మొదలైన రిలీజ్ కు “ఈసారి ఓపెనింగ్ ఏ రేంజ్ లో వుంటుందా?” అనే ప్రశ్నతోనే మొత్తం ఇండస్ట్రీ ఉత్కంఠగా చూస్తోంది.

అఖండ 2 రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈరోజు నుంచే ప్రీమియర్ల సందడి ప్రారంభం అవుతుంది. అయితే వాయిదా కారణంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లకు అవసరమైన బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఇప్పుడు కొత్త లెక్కలతో ముందుకు వస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే —

కోర్ట్ కేసులు, వాయిదానే సినిమాకు మరింత హైప్ తెచ్చింది. గత వారం కంటే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ మరింత బలంగా, మంచి మొమెంటంతో సాగుతున్నాయి. అయినప్పటికీ, విడుదలలో ఆలస్యం జరగడంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు తమ చెల్లించాల్సిన మొత్తాన్ని మళ్లీ చర్చించి, కొంత భాగం మాత్రమే క్లియర్ చేశారని సమాచారం. దీంతో మొత్తం బిజినెస్ లెక్కల్లో మార్పులు రావడం సహజం.

విడుదల తేదీ మారడం ఓవర్ సీస్, rest of India బిజినెస్‌పై కూడా ప్రభావం చూపిందనే టాక్ వినిపిస్తోంది. మొదట తెలుగు వెర్షన్‌కు డిస్ట్రిబ్యూటర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ₹125 కోట్లగా ఉండగా, ఇప్పుడు అది ₹110 కోట్ల వరకు తగ్గింది. అంటే, సినిమా బాక్సాఫీస్‌పై హిట్‌గా నిలవాలంటే ఇప్పుడు ఇది ₹180 కోట్లు పైగా గ్రాస్ చేయాలి. ఇక ₹200 కోట్లు దాటితే ‘అఖండ 2’ను సూపర్ హిట్ గా ప్రకటించవచ్చు.

అఖండ 2కు ట్రేడ్ కట్టిన భారీ లెక్కలు!

‘అఖండ 2’ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. అదే రేంజ్‌లో ప్రతి ఏరియాలో రికార్డు రేట్‌కి అమ్మేశారు. అందుకే ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి: “బ్రేక్ ఈవెన్ అంటే కనీసం ₹200 కోట్లుకి తగ్గకూడదు.” కానీ ఇది అసంభవమా? కాదు! ట్రేడ్ టాక్ ప్రకారం, బజ్, కాంబినేషన్ హైప్, ప్రీమియర్ టికెట్ ధరలు చూస్తుంటే ₹200 కోట్లు పెద్ద సమస్య కాకపోవచ్చు.

ఇక్కడ కీలకం —

ఫస్ట్ డే టాక్ ఉదాహరణకు, సంక్రాంతికి వచ్చిన ‘డాకూ మహారాజ్’ మంచి టాక్ తెచ్చుకుంది. సీజన్ కూడా హెల్ప్ అయింది. అయినా ఫుల్ రన్‌లో రూ.120 కోట్లకే ఆగిపోయింది.

చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కుదర్లేదు. అయితే అది బాలయ్య కెరీర్‌లో ₹100 కోట్ల క్లబ్‌కు డోర్ ఓపెన్ చేసిన సినిమా కావడం ప్రత్యేకం.

కానీ ‘అఖండ 2’ పరిస్థితులు పూర్తిగా భిన్నం —

బాలయ్య + బోయపాటి = మాస్

ఫుల్-ఫ్లెజ్డ్ యాక్షన్

సీక్వెల్ హైప్ అతి భారీగా

ఇప్పుడు మార్కెట్ కూడా మారిపోయింది.

ఈ రోజుల్లో మాస్ యాక్షన్ సినిమాలకు ₹200 కోట్లు టార్గెట్ సాధారణమే. అదీ కాక, ఈసారి పాన్ ఇండియా రిలీజ్, హిందీలో భారీ ప్రమోషన్స్ అంటే యాక్షన్ జోనర్‌కు నార్త్‌లో మంచి పుల్ దొరకొచ్చు.

ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే—

వాళ్లు ఆశిస్తున్నది కేవలం బ్రేక్ ఈవెన్ కాదు. సినిమా బాగా ఆడితే వచ్చే ఓవర్‌ఫ్లోస్ వారికి మరికొన్ని ఆర్థిక ఇబ్బందులను క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ప్రస్తుతం సినిమా చుట్టూ పెరుగుతున్న బజ్, ఈ రాత్రి ప్రీమియర్ల తర్వాత వచ్చే పాజిటివ్ వర్డ్-ఆఫ్-మౌత్—all combined—రేపటి బాక్సాఫీస్ నెంబర్లు అసాధారణంగా ఉండే అవకాశం కల్పిస్తున్నాయి.

అయితే మరో ట్విస్ట్

తాజాగా అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్‌ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది.

దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్‌ ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

‘అవతార్ 3’తో ఫైట్ – అఖండ 2 రెండో వారం లెక్కలు ఎలా?

అయితే, ప్రయాణం అంత సులభం కాదు. ఓవర్సీస్‌లో, మల్టీప్లెక్సుల్లో ‘అవతార్ 3’ రూపంలో వచ్చే వారం బలమైన పోటీ ఎదురుకాబోతోంది. ఇది అఖండ 2 రెండో వారం కలెక్షన్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే పరిశ్రమలో ఇప్పుడు ఒకటే మాట: “ఫస్ట్ వీక్ స్టార్మ్ హిట్ అయితే… అఖండ 2 లెక్కలు మరో లెవల్‌కు వెళ్తాయి.”

ఇప్పుడు చూడాల్సింది —

బాలయ్య – బోయపాటి మాస్ తాండవం....అవతార్ 3 హాలీవుడ్ పవర్ ను ఎలా దాటుకుని ముందుకు వెళ్తుందనేది.

ఒక్క మాటలో — 200 కోట్ల లక్ష్యం ఉంది… దాన్ని బద్దలు కొట్టడం బాలయ్య చేతిలోనే!

Tags:    

Similar News