ముఫాసా: ది లయన్ కింగ్ (తెలుగు) రివ్యూ
మహేష్ బాబు ప్రధాన పాత్రకు తెలుగు డబ్బింగ్, హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రొడక్షన్ నుంచి వస్తున్న భారీ యానిమేషన్ సినిమా ఇంకా చెప్పేదేముంది పండగే.
మహేష్ బాబు ప్రధాన పాత్రకు తెలుగు డబ్బింగ్, హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రొడక్షన్ నుంచి వస్తున్న భారీ యానిమేషన్ సినిమా ఇంకా చెప్పేదేముంది పండగే. దానికి తోడు సూపర్ హిట్ లయిన్ కింగ్ కు ప్రీక్వెల్. ఇవన్నీ పిల్లలను పెద్దలను సినిమా చూడటానికి ఖచ్చితంగా ప్రేరేపిస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే 'ది లయన్ కింగ్' ని చూసిన కళ్ళతో ,ఊహలతో ఈ సినిమాపై పెట్టుకున్న ,పెంచుకున్న అంచనాలను రీచ్ కాగలగిందా, సినిమా ఎలా ఉంది..హిట్టైనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఈ సినిమా ది లయన్ కింగ్ లో కనపడి, చనిపోయిన ముఫాసా కథ, అతను అడవికి రాజు ఎలా అయ్యాడు. అతని సోదరుడు స్కార్ విలన్ ఎలా అయ్యాడనే విషయాలు వివరిస్తుంది.సినిమా ప్రారంభంలో సింబా , నాలా మరో బిడ్డను తమ జీవితాల్లో కి ఆహ్వానించటం కోసం అడవిలోకి వెళ్లిపోతాయి. ఆ సమయంలో అడవికి వెళ్ళేటప్పుడు తమ కుమార్తె కైరా ని టిమోన్, పుంబాకు అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమంటాయి. ఆ సమయంలో వర్షం వస్తుంది. అది చూసి బుజ్జి సింహం పాప కైరా భయపడుతుంది. అప్పుడు రఫీక్ అనే కోతి వచ్చి మీ తాత ముఫాసా ఓ టైమ్ లో తనకు నీళ్ళు అంటే ఉన్న భయాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, ఎలా అడవికి రాజయ్యాడు అనే విషయాలు చెప్పి ఆ చిన్నారి సింహంలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తుంది.
ఇంతకీ రఫీకా ఏం చెప్తుందంటే... ముఫాసా చిన్నప్పట్నుంచి చాలా చురుకైన వాడు. వేగంగా పరుగులు పెట్టడంలో .. తెలివిలో తనకు తానే సాటి అనిపించుకుంటాడు. తన తల్లి,తండ్రులతో ఆనందంగా జీవితం గడుపుతుంటే ఓ ప్రకృతి విపత్తు ఆ కుటుంబాన్ని విడతీస్తుంది.. ఓ వరదలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు దూరమవుతాడు ముఫాసా.. వేరే చోటకు కొట్టుకుపోయి..అక్కడున్న రాజైన సింహం కుటుంబానికి దగ్గరవుతాడు. అయితే వాళ్ళు అతన్ని అనాధలాగే చూస్తుంటాడు.
మొదట్లో ఆ రాజ్యానికి రాజు అయిన ఒబాసికి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ అతడి భార్య-కొడుకు.. ముఫాసాను చేరదీస్తారు. ముఫాసా పెరిగి పెద్దయ్యాక కూడా ఒబాసి మీద అయిష్టత తగ్గదు. తన కొడుకుని దెబ్బ కొడతాడని భయపడుతూంటాడు. అలాంటి సమయంలోనే ప్రమాదకర తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద, ఆ తర్వాత సింహాలు అన్నిటి మీద దాడి చేస్తాయి. ఆ దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో ఆ తెల్ల సింహాల రాజు కొడుకును ముఫాసా చంపేస్తాడు. దీంతో రాజు అతడిపై కక్షగట్టి అతడి వాళ్లందరినీ అంతం చేయడానికి బయల్దేరతాడు తెల్ల సిహం రాజు. అప్పుడు తెల్ల సింహాల నుంచి ముఫాసా ఎలా తప్పించుకుని రాజయ్యాడు. చిన్నప్పుడే విడిపోయిన తన తల్లి,తండ్రిని ఎలా కలుసుకున్నాడు.. ముఫాసా జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలు ఏమిటనేది మిగతా కథ.
విశ్లేషణ
ఇదేమీ కథా ప్రపంచానికి కొత్త కథ కాదు. అలాగే ఎన్నో సార్లు తెరకెక్కిన కథే. చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరమయ్యే ఓ కొడుకు.. ఆ బిడ్డను చేరదీసి తన కొడుకుతో పాటు ఇంకో బిడ్డలా పెంచే ఓ తల్లి.. అలాగే ఆ అనాధ పిల్లాడు అంటే ఇష్టపడి తండ్రి, అస్సలు నచ్చని తండ్రి.. తన కుటుంబం కోసం హీరో తీవ్రమైన వెతుకులాట, టీనేజ్ ప్రేమ, సోదరుల మధ్య గొడవలు ఇవన్నీ తెలిసిన విషయాలే కావటంతో పెద్దగా ఆసక్తి గా అనిపించదు. దాంతో విజువల్ గా ఎంత స్టాండర్స్ లో తీసినప్పటికీ కథగా మాత్రం 'ముఫాసా' ఏ దశలోనూ ఎగ్జైట్ చేయదు. విజువల్ మాయాజాలంతో మన మనసు నిండదు.
పోనీ ఆ తెలిసిన కథ అయినా ఇంట్రెస్టింగ్ గా చెప్పారా అంటే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఏ మాత్రం రేకెత్తించని విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగని మంచి ఎపిసోడ్స్ లేవని కాదు..పిల్లలకు ఖచ్చితంగా చూడాలనిపించడం త ఫన్, ఎంటర్టైన్మెంట్ లేవు. అయితే లయిన్ కింగ్ సినిమా చూసిన వారికి అందులో స్టార్ బ్యాక్ స్టోరీ ఏమిటి, ముఫాసా అసలు ఎవరు వంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తే అందుకు ఈ సినిమా సమాధానం ఇస్తుంది ఇంతవరకు ఈ సినిమాని లోపలికి తీసుకోగలం.
టెక్నికల్ గా
హాలీవుడ్ అందులో డిస్నీ వంటి స్టూడియో తీసిన సినిమాలో టెక్నికల్ లోటే ముంటుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్టులతో 'ముఫాసా' చూస్తున్నంతసేపు నిజంగా మనం ఓ అడవిలో జంతువుల మధ్య సంచరిస్తున్న భావన కలుగ చేయటంలో వందశాతం సక్సెస్ అయ్యారు. ఎక్కడా అసహజంగా అనిపించకుండా చక్కగా కుదిరిన విజువల్ ఎఫెక్టులు సినిమాకు ప్రధాన ఆకర్షణ . లైవ్ యానిమేషన్ సినిమాకు సహజత్వం తెచ్చి పెట్టింది.. అలాగే డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.
మహేష్ బాబు డబ్బింగ్ లో ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్స్ ఫెరఫెక్ట్ గా దించేసారు. ఆ పాత్రలో ఉన్న స్ట్రగుల్ & పెయిన్ ను ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ఉంది. పుంబాకు బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ టిమాన్ కు అలీ చెప్పిన డబ్బింగ్ ఫన్నీగా ఫెరఫెక్ట్ సింక్ . పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ మంచి ఆప్షన్. ఇక టాకా క్యారెక్టర్ కు సత్యదేవ్ వాయిస్, వైట్ లయన్ రోల్ కి అయ్యప్ప శర్మ వాయిస్, రఫీకి క్యారెక్టర్ కి ఆర్.సి.ఎం రాజు వాయిస్ లు బాగా కుదిరాయి.
చూడచ్చా
పిల్లలు ఓ సారి చూసి ఎంజాయ్ చేయచ్చు. వారు కథ ని ఎక్కువ ఎక్సపెక్ట్ చేయరు కాబట్టి. అలాగే మహేష్ అభిమానులు కూడా తమ అభిమాన హీరో వాయిస్ వినడానికి ఈ సినిమా మంచి ఛాయిస్