Kerala CM : “సామాజిక వాస్తవాలకు అద్దం పట్టే చిత్రాలు రావాలి’’
“ఏదైనా ఒక వర్గానికి చెందిన లేదా నిర్దిష్ట దృక్కోణాలను మాత్రమే ప్రదర్శించే సినిమాలు చిత్ర పరిశ్రమను బలహీనపరుస్తాయి’’ - కేరళ సీఎం పినరయి విజయన్;
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK) 29వ ఎడిషన్ శుక్రవారం తిరువనంతపురంలో ఘనంగా ప్రారంభమైంది. నిశాగాంధీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. బాలీవుడ్ ఐకాన్ షబానా అజ్మీ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రముఖ హాంకాంగ్ (SAR PRC) ఫిల్మ్ మేకర్ ఆన్ హుయ్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. విభిన్న సామాజిక వాస్తవాలను చూపేందుకు సినిమా ఒక మాధ్యమం అని పేర్కొన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకునే చిత్రాలను రూపొందించడం సినిమా సారాన్ని దెబ్బతీస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
1994లో కేరళలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)కి ప్రముఖ నటి షబానా అజ్మీ ప్రత్యేక అతిథిగా వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వామపక్ష ప్రేక్షకుల నుంచి ఆమెకు ఘన స్వాగతం లభించింది. CPI(M) సాంస్కృతిక కార్యకర్త సఫ్దర్ హష్మీ హత్యకు వ్యతిరేకంగా 1989లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో షాబానా నిరసన ఆమె హోదాను సుస్థిరం చేసింది. ముప్పై సంవత్సరాల తరువాత 2024లో షబానా అజ్మీ తన 50ఏళ్ల కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ..“ఇప్పుడు, నేను తిరిగి రావడం దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. ఫిల్మ్ మేకింగ్ అనేది సహజంగానే సహకారంతో కూడుకున్నది. అయితే నటీనటులు తరచుగా చాలా అవార్డులను అందుకుంటారు. ఎందుకంటే వారి ముఖాలు కెమెరా ముందు ఉంటాయి. అయితే లెక్కలేనన్ని మంది తెర వెనుక అవిశ్రాంతంగా పని చేస్తారు. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేరళను సందర్శించడం మరియు మంచి సినిమా పట్ల అభిరుచి ఉన్న అక్కడి ప్రజలతో మమేకమవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది” అని షాబానా పేర్కొన్నారు.
‘సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే చిత్రాలు తీయాలి’
“ఏదైనా ఒక వర్గానికి చెందిన లేదా నిర్దిష్ట దృక్కోణాలను మాత్రమే ప్రదర్శించే సినిమాలు రూపొందితే..అది చిత్ర పరిశ్రమ బలహీనపడటానికి దారి తీస్తుంది. చిత్ర రంగానికి చెందిన వారు కళాత్మక విలువలతో కూడిన వివిధ అంశాలు, సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించాలి” అని ముఖ్యమంత్రి అన్నారు. “ఫెస్టివల్ అంటే సినిమా ప్రదర్శనలు మాత్రమే కాదు. ఇందులో చర్చలతో పాటు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదిక కూడా. గాజాలో జరిగిన మారణహోమం నేపథ్యంలో గత సంవత్సరం మేము పాలస్తీనా చిత్రాలపై దృష్టి పెట్టాం. అప్పటి నుంచి అక్కడ పరిస్థితి మరింత దిగజారింది. ఈ సంవత్సరం కంట్రీ ఫోకస్ విభాగంలో ఆర్మేనియన్ సినిమా ఉంది. ఇందులోనూ మారణహోమం, అంతర్యుద్ధం కనిపిస్తాయి. ఈ ఫెస్టివల్ ద్వారా అణగారిన వర్గాల జీవన స్థితిగతులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని పినరయి చెప్పారు.
ఆన్ హుయ్‌కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..
సినీ పరిశ్రమలో మహిళల ఉనికికి ప్రతీకగా హాంకాంగ్‌లోని న్యూ వేవ్ సినిమా ఉద్యమంలో అగ్రగామి అయిన ఆన్ హుయ్‌కి విజయన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందించారు. అలాగే ఇండస్ట్రీలో 50 ఏళ్లు జరుపుకుంటున్న బాలీవుడ్ లెజెండ్ షబానా అజ్మీని కూడా సన్మానించారు. "షబానా అజ్మీ కేవలం కళాకారిణి మాత్రమే కాదు. లౌకిక విలువలను నిలబెట్టడంలో, దేశ సాంస్కృతిక, సామాజిక రంగాలను సుసంపన్నం చేయడంలో గణనీయమైన కృషి చేసిన కార్యకర్త" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మహిళలకు పెద్దపీఠ..
కేరళ ప్రభుత్వం ముఖ్యంగా నాలుగేళ్లుగా హేమా కమిటీ నివేదికను నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఈ ఏడాది ఐఎఫ్‌ఎఫ్‌కేలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. మహిళా చిత్రనిర్మాతలు రూపొందించిన మొత్తం 177 చిత్రాలలో మహిళా దృక్కోణం ఆధారంగా రూపొందించినవి చిత్రాలు 52 ఉన్నాయి. ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రంతో అత్యుత్తమ విజయాన్ని సాధించినందుకు పాయల్ కపాడియాకు అత్యుత్తమ పురస్కారం -‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ అవార్డు లభించింది.
హేమా కమిటీ నివేదికను ప్రస్తావించిన సాజి చెరియన్..
సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ హేమ కమిటీ నివేదికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. “హేమ కమిటీ విప్లవాత్మకమైనది. కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. సిఫార్సులు అమలయ్యేలా చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని మంత్రి చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏ వక్త కూడా రాజకీయ కోణాన్ని ప్రస్తావించలేదు. అయితే కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్, నటుడు ప్రేమ్‌కుమార్ వయనాడ్ ప్రకృతి విపత్తుకు నిధులు కేటాయించడంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై తప్పుబట్టారు. “IFFKకు రాజకీయాలతో పోలిక లేదు. ఫెస్టివల్‌ను సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలి. ఫిల్మ్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం, పార్టీ ఓవర్‌రీచ్‌తో సహా ఫెస్టివల్, తదుపరి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి.”అని ప్రతినిధి ఆదర్శ్ మోహన్ పేర్కొ్న్నారు.