సుకుమార్ సాయంతో ‘దేవి నాగవల్లి’ డైరక్టర్ గా ప్రమోషన్?

ప్రముఖ జర్నలిస్ట్ దేవీ నాగవల్లీ మీడియాకు బై చెప్పినట్లేనా?;

Update: 2024-12-08 06:04 GMT

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పుష్ప ది రూల్’ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. సినిమా సక్సెస్ కు దర్శకుడుతో పాటు టీమ్ అంతా కష్టపడి పనిచేస్తేనే ఆ స్దాయి ఫలితం దక్కుతుంది. ఆ టీమ్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అలాగే ఈ సినిమాకు ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి పని చేశారనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా దేవి నాగవల్లి( devi nagavalli ) ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. పుష్ప సినిమా టైటిల్స్ లో కూడా దేవి నాగవల్లి పేరు కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటిది ఆమె జర్నలిస్ట్ కదా ఎప్పుడు ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యింది. ఎప్పుడు డైరక్షన్ డిపార్టమెంట్ లో పని చేసిందనే డిస్కషన్ మొదలైంది.

ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. సుకుమార్ దగ్గర డైరక్షన్ డిపార్టమెంట్ లో పని చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అందుకు కారణం సుకుమార్ దగ్గర చేసిన చాలామంది నేడు డైరక్టర్స్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగటమే.
ముఖ్యంగా సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా మందికి ప్రేరణగా నిలిచింది. తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సుకుమార్ శిష్యుడు గా సత్తా చాటారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా సినిమాను చేస్తున్నాడు బుచ్చిబాబు. అలాగే నానితో దసరా సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల కూడా సుక్కు శిష్యుడే. ఈ క్రమంలో చాలా మంది సుకుమార్ దగ్గర చేరాలని ఉత్సాహపడతారు, పడ్డారు. అయితే కొద్దిమందికే ఆ అవకాశం దక్కింది. అందులో ఒకరు దేవి నాగవల్లి.
దేవి నాగవల్లి... రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. న్యూస్ యాంకర్ గా తన మాటలతో, ఇంటర్వ్యూలతో అందరికీ సుపరిచితం . టీవీ 9 యాంకర్ గా తన ముక్కుసూటి తనంతో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది దేవి నాగవల్లి. కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో, లైవ్ డిబేట్స్ లలో ఆమె మాట్లాడిన మాటలు మీడియా లో మీమ్స్ లాగా వైరల్ అయ్యాయంటేనే ఆమె సత్తా అర్దం చేసుకోవచ్చు. అయితే ఈమె ఇంకోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయితే ఈ సారి దానికి కారణం పుష్ప ది రూల్.
పుష్ప 2 టైటిల్ క్రెడిట్స్ లోని అసిస్టెంట్ డైరెక్టర్స్ లిస్ట్ లో దేవి నాగ వల్లి పేరు కూడా ఉంది. దేవి నాగవల్లి పేరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటంతో ఆశ్చర్య పోయారు.. ఇక ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. పుష్ప లో పనిచేసే అవకాశం కల్పించినందుకు ఆమె సుకుమార్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
"థాంక్ యు సుక్కు సర్! మీరు నా గురువుగా లభించడం, మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టం" అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. ఈ సినిమాలో వచ్చే మీడియా సీన్స్, , రిపోర్టింగ్ సీన్స్ వంటి వాటిలో దేవి నాగవల్లి హెల్ప్ చేసిందట. ఈ సీన్స్ షూట్ చేసేటప్పుడు సెట్స్ లో సుకుమార్ కి అసిస్టెంట్ గా పని చేసింది అని చెప్పుకుంటున్నారు.
పుష్ప 2 సక్సెస్ మీట్ లో సుకుమార్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరిని పరిచయం చేశారు. ఒక ముఖ్యంగా దేవి నాగవల్లి గురించి మాట్లాడుతూ దేవీ నాగవల్లికి విపరీతమైన టాలెంట్ ఉంది. ఆమెకి చాలా స్టోరీస్ పైన మంచి అవగాహన ఉంది. ఫ్యూచర్లో అన్ని బాగుంటే దేవీ నాగవల్లి కథను నేను దర్శకత్వం చేసే అవకాశం కూడా ఉంది అని సుకుమార్ ఆన్ స్టేజ్ చెప్పుకొచ్చారు.
ఇదంతా విన్నవాళ్లు త్వరలోనే సుకుమార్ రైటింగ్స్ లో ఆమె ఓ సినిమా డైరక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే ఆమె డైరక్షన్ చేయటానికి సిద్దంగా ఉందా లేదా, మరో రెండు సినిమాలు చేసి అప్పుడు మెగా ఫోన్ పడుతుందా, ఈలోగా సినిమాలకు రైటర్ గా పనిచేస్తుందా వేచి చూడాల్సిన అంశం.
ఇక పుష్ప 2 భాక్సాఫీస్ విషయానికి వస్తే... గురువారం భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన పుష్ప‌-2.. వాటిని అందుకుందనే చెప్పాలి. టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ వ‌సూళ్లు నిల‌క‌డ‌గానే ఉన్నాయి. రెండో రోజు కొద్దిపాటి డ్రాప్ చూసిన పుష్ప‌-2.. వీకెండ్ అయిన‌ మూడో రోజు పుంజుకుంది.
దేశ‌వ్యాప్తంగా వ‌సూళ్లు బాగున్నాయి. హిందీలో అయితే సినిమా ఓ రేంజిలో అదరకొడుతోంది. అయితే ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే పలు ప్రాంతాల్లో ఈ సినిమా వెనుకబడటం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల దృష్టికి వచ్చింది. నైజాం లాంటి కేంద్రాల్లో స్ట్రాంగ్ గా ఉన్నా ఏపీలోని కొన్ని సెంటర్లలో వీక్ డేస్ వసూళ్లు బాగా నెమ్మదించడం వెనుక అధిక టికెట్ ధరలే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దానికి అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి సాధారణ రేట్లు తీసుకొచ్చే ఆలోచనలో మైత్రి టీమ్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం, అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.



Tags:    

Similar News