నాగార్జునకు 'ఎన్ కన్వెన్షన్' బంగారు బాతు ఎలా అయ్యింది?

ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ ఏమిటి అంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతే. చెరువును ఆక్రమించి కట్టారంటూ హైడ్రా దీనిని కూల్చివేయటం ఎవరూ ఊహించని విషయం.

Update: 2024-08-27 10:53 GMT

ప్పుడు మీడియా లో హాట్ టాపిక్ ఏమిటి అంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతే. చెరువును ఆక్రమించి కట్టారంటూ హైడ్రా దీనిని కూల్చివేయటం ఎవరూ ఊహించని విషయం. తాను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించుకోలేదని.. తన పట్టా భూమిలోనే నిర్మించానని హీరో నాగార్జున అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకత ఏమిటి?.. దాని విలువ, నాగార్జు ఎంత నష్టపోయారు అనే విషయాలు చూద్దాం.

హైదరాబాద్ మాదాపూర్ లో మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో నాగార్జున మ‌రియు నల్ల ప్రీతమ్ రెడ్డి సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ సెంట‌ర్ ను నిర్మించారు. 14 ఏళ్ల కిందట అంటే దాదాపు గా 2010లో దీనిని నిర్మించారు. ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ పేరిట దీని నిర్మాణం జరిగింది. ఇక ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఉన్నత స్థాయి వేడుక ఏదైనా ఎన్ కన్వెన్షన్ వేదికగా మారిపోయింది.ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు, గెట్ టు గెదర్ పార్టీలకు ఎన్ కన్వెన్షన్ పెట్టింది పేరు.

అయితే తుమ్మిడికుంట చెరువును క‌బ్జా చేసి ఎన్ క‌న్వెన్ష‌న్ ను నిర్మించార‌ని చాలా ఏళ్ల నుంచి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్రమంలో హైడ్రాకు ఫిర్యాదులు కూడా అంద‌గా.. అధికారులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్టారు. మొత్తం ప‌ది ఎక‌రాల స్థ‌లంలో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్) పరిధిలో, మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉన్నాయని విచార‌ణ‌లో తేల‌డంతో.. హైడ్రా టీమ్ శ‌నివారం ఉద‌యం ఎన్ క‌న్వెన్ష‌న్ ను కూల్చివేసింది.

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో మొత్తం నాలుగు హాళ్లు ఉండేవి. 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన హాల్ నిర్మించారు. ఇందులో ఒకేసారి మూడు వేల మంది కూర్చునే అవకాశం ఉండేది. ఇందులో భారీ స్థాయిలో జరిగే పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఫ్యాషన్ షోలు, సినిమా ఈవెంట్స్ నిర్వహించేవారు. ఇక దీనికి ఆనుకునే 37 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గార్డెన్ ఉండేది. ఇందులో ఫంక్షన్లు, వివాహాలు జరిగేవి. వీటితో పాటుగా ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో డైమండ్ హాల్ పేరిట మరో నిర్మాణం ఉండేది. ఇందులో చిన్న వేడుకలు నిర్వహించేవారు. దీని బయట 26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బనియాన్ పేరిట ఓపెన్ ఎయిర్ వెన్యూ ఉండేది.

ఇక ఈ కూల్చివేత కార‌ణంగా నాగార్జున భారీగానే న‌ష్ట‌పోయార‌ని ఇన్ సైడ్ టాక్ . మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు .. ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ మొత్తం విలువ రూ. 400 కోట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ ఎన్ క‌న్వెన్ష‌న్ లో మొత్తం 4 హాళ్లు ఉంటాయి. వాటి అద్దె రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందట‌. ప్ర‌తి ఏడాది నాగార్జున‌కు ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ద్వారా రూ. 100 కోట్ల‌కు పైగా ఆదాయం వ‌స్తుంద‌ట‌. ఇప్పుడు హైడ్రా అధికారులు దాన్ని కూల్చివేయ‌డంతో నాగార్జునకు కొన్ని వందల కోట్లలో నష్టం వాటిల్లిందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News