దీపికా పదుకొణెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్ రెడ్డి వంగా

స్పిరిట్ కథను లీక్ చేస్తున్నారంటూ పరోక్షంగా ట్వీట్ చేసిన దర్శకుడు;

Update: 2025-05-27 09:32 GMT
సందీప్ రెడ్డి వంగా, దీపికా పదుకొణె

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ నటి దీపికా పడుకొణే పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తాను దర్శకత్వం వహించే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన కథను బహిరంగరచడానికి చెత్త గేమ్స్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సందీప్ రెడ్డి- ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మొదట కథానాయికగా బాలీవుడ్ భామ దీపికా పదుకొణేను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకోవడంతో మరో ముద్దుగుమ్మ త్రిప్తి దిమ్రిని తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత దీపికా పీఆర్ టీమ్ కథను లీక్ చేసే ప్రయత్నం చేసిందని సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘డర్టీ పీఆర్ గేమ్’’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తన సినిమాలో ఏ రేటేడ్ సన్నివేశాలు, షెడ్యూల్ సమస్యలు, ప్రాజెక్ట్ లో తగిన పారితోషికం లేదని అందుకే తప్పుకుంటున్నట్లు దీపికా పీఆర్ టీమ్ ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. అయితే సందీప్ తన ట్వీట్ లో ఎక్కడ దీపికా పేరు ప్రస్తావించలేదు. ఓ నటి తన నమ్మాకాన్ని వమ్ము చేసిందని మాత్రం అన్నారు.
నువ్వు ఎవరో నేను చెప్పను..
నేను ఒక నటుడు, నటికి కథ చెప్పే సమయంలో వందశాతం నమ్ముతాను. మన మధ్య కథ చెప్పే సమయంలో ఒక అనధికార ఒప్పందం ఉంటుంది. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీరు మీ వ్యక్తిని ‘డిస్క్ లోడ్’ చేశారు. ఒక చిన్న నటి పై మీరు చూసే చూపు ఇదా? నా కథను బయటకు చెబుతారా? మీ ఫెమినిజం అంటే ఇదేనా? ’’ అని సందీప్ రెడ్డి ఘాటుగా పోస్ట్ చేశారు.
సమయం.. పారితోషికం..
బిడ్డ పుట్టిన తరువాత తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడం, దీపిక షూటింగ్ లో నిర్ణిత గంటలు కావడం కావాలని డిమాండ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దీపికా రూ. 40 కోట్లు డిమాండ్ చేసినట్లు, కానీ నిర్మాతలు రూ. 20 కోట్ల వరకూ ఆఫర్ చేసినట్లు తెలిసింది. తరువాత ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకుంది.
సందీప్ రెడ్డి వంగా ఇంతకుముందు బాలీవుడ్ లో కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి సంచలనం సృష్టించాడు. ఆయన సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. స్పిరిట్ కూడా దీనికి భిన్నంగా ఏమి ఉండకపోవచ్చు. పింక్ విల్లా ప్రకారం.. స్పిరిట్ లో రేసీ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది.
త్రిప్తి దిమ్రి..
స్పిరిట్ లో ప్రభాస్ తో కలిసి నటించే అవకాశాన్ని త్రిప్తి దిమ్రి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి స్వయంగా ఎక్స్ లో ప్రకటించారు. గతంలో ఈ నటి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన యానిమల్ లో నటించింది. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద 900 కోట్లను రాబట్టింది.


Tags:    

Similar News