‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ రివ్వూ

ఏమిటి ఈ సినిమా కథ, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;

Update: 2025-02-22 08:01 GMT

రొమాంటిక్ కామెడీకు యూత్ ఉన్నంతకాలం డిమాండ్ ఉంటుంది. అయితే రొమాంటిక్ కామెడీ పేరు చెప్పి బూతుని దిమ్మరించకూడదు. ముఖ్యంగా సినిమాలో చూపే లీడ్ పెయిర్ మధ్య మ్యాజిక్ తెరపై పరిపూర్ణంగా ఆవిష్కారం అవ్వాలి. అందుకు దర్శకుడుకి క్రాఫ్ట్ పై పట్టు ఉండాలి. నటుడుగా మనకు పరిచయమైన ధనుష్ , డైరెక్టర్ గానూ రెండు సినిమాలు చేసారు. ఇప్పుడు మూడో సినిమాగా తన మేనల్లుడుని లాంచ్ చేస్తూ ఈ రొమాంటిక్ కామెడీ తీసుకొచ్చాడు. తన అనుభవంతో కలగలిపి చేసిన ఈ సినిమా తన మేనల్లుడు కెరీర్ కు ఏ విధంగా ప్లస్ అయ్యింది. ఏమిటి ఈ సినిమా కథ, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఇది చాలా సింపుల్ స్టోరీ లైన్. అబ్బాయి ప్రభు (పావిష్) ఓ చెఫ్, అమ్మాయి నీల (అనికా సురేంద్రన్‌) ఓ ఫుడీ. ఆమె అతన్ని చూస్తుంది. అతను ఆమెను చూస్తాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారని అర్థం చేసుకుంటారు. అయితే ఓ ప్రత్యేకమైన కారణంతో వీళ్లకు బ్రేకప్ అవుతుంది. ఎవరి జీవితంలోకి వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి (ప్రియా ప్రకాష్‌ వారియర్‌) వస్తుంది. ఆమెను ఓ పెళ్లి చూపుల్లో చూస్తాడు. చిన్నప్పటి క్లాస్ మేట్స్ ని అర్థం చేసుకుని ఇద్దరు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యిపోదామనుకుంటారు.

అయితే ఈ లోగా ఈ కుర్రాడి బ్రేకప్ లవర్ నీల కు పెళ్లి అని తెలుస్తుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెళ్ళికి వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది. పాత ప్రేమ కథ ఇద్దరికి గుర్తు వచ్చిందా, మళ్లీ ఇద్దరు ఒకటయ్యే సిట్యువేషన్ క్రియేట్ అయ్యాయా, ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి పరిస్దితి ఏమిటి, అలాగే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో పరిచయమైన అంజలి (రమ్య రంగనాథన్‌) ఈ కథలో ఏ పాత్ర పోషించి మలుపు తిప్పింది? ఫైనల్ గా నీలా పెళ్లి ఎవరితో జరిగింది అన్నది ఈ కథ.

ఎనాలసిస్

ధనుష్ ఈ సినిమాని లైటర్ వీన్ కామెడీలో చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఎక్కడా స్ట్రాంగ్ డోస్ ఇవ్వలేదు. బ్రేకప్, లవర్ పెళ్లి కు వెళ్లటం, అక్కడ రచ్చ వంటి ఎలిమెంట్స్ తో లాగేసాడు. అయితే మరీ సింపుల్ గా అనిపిస్తుంది. యూత్ కు మాత్రం బాగుందే అనిపిస్తుంది. ఎక్కడా డెప్త్ గా వెళ్లకపోవటం కాస్త నిరాశ అనిపిస్తుంది. అదే సమయంలో ఇదే బెటర్ కదా అనే భావన రప్పిస్తాడు. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమా ని బ్రేకప్‌ సాంగ్‌తో సినిమా మొదలెట్టడంతోనే తన మార్క్ చూపించేసాడు ధనుష్.

అయితే కొత్తదనం ఆశించకూడదు. చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ఫస్టాఫ్ పెద్దగా ఏమి జరిగినట్లు ఉండదు. సెకండాఫ్ లో అసలు కథ మొదలెట్టాడు. అలాగే సినిమాని యూత్ ఆలోచనలకు తగినట్లు గా చాలా కలర్ ఫుల్ గా చూపించే ప్రయత్నం చేసాడు. ముప్పై లోపువాళ్లు బాగా ఎంజాయ్ చేసే విధంగా రాసుకున్నారు. అన్నీ బాగున్నా చివర్లో క్లైమాక్స్ సీన్స్ మాత్రం సీక్వెల్ కు లీడ్ వదలటం మాత్రం చిరాకు అనిపిస్తుది. చివరకు ఇలాంటి సినిమాలకు కూడా సీక్వెల్ వదలాలా అనిపిస్తుంది.

టెక్నికల్ గా

దర్శకుడుగా రాయన్ సినిమాతో ధనుష్ నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్లాడు. ఏ ఫ్రేమ్ ఎలా పెడితే ఏ ఫలితం వస్తుందో బాగా తెలుసు. అదే ఈ సినిమాలోనూ రిఫ్లెక్ట్ అయ్యింది. కథ కాస్త డ్రాప్ అవుతుందన్న టైమ్ లో పాట పెట్టడం వంటి టెక్నిక్స్ బాగా వాడాడు. డైలాగులు సోసోగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. జీవీ ప్రకాష్‌ సంగీతం లో ఓ పాట పెద్ద హిట్. ఆర్డ్ డిపార్టమెంట్, ఎడిటింగ్ బాగా పనిచేసారు.

హీరోగా పరిచయం అయిన ధనుష్‌ మేనల్లుడు పవీష్‌ బోయ్ ఎట్ నెక్స్ట్ డోర్ లాగ ఉన్నాడు. అయితే తన మేనమామను అనుకరిస్తున్నాడు. అందులోంచి బయిటకు రావాలి. 'నీల'గా అనికా సురేంద్రన్‌ బ్యూటిఫుల్ గా ఉంది. హీరో ఫ్రెండ్‌ రాజేష్‌గా మాథ్యూ థామస్‌ ఫన్ సినిమాకు హైలెట్.

చూడచ్చు

ఈ వీకెండ్ సరదాగా ఏ మాత్రం బుర్రకి పని పెట్టని లైటర్ వీన్ సినిమాగా దీన్ని చూడచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. ధనుష్ ట్రైలర్ లో చెప్పినట్లు జాలీగా రండి.. జాలీగా వెళ్లండి!!

Tags:    

Similar News