దసరా 2024: తెలుగు రిలీజ్ లు...ఏది హిట్,ఏది ఫట్? ఏ పాఠాలు నేర్పాయి?

సంక్రాంతికి ఎంత క్రేజ్ ఉంటుందో దాదాపు అంతే దసరా సినిమాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే రెండు పండగలకు పెద్ద సినిమాలు అనుకున్నవి పోటీకి దిగుతూంటాయి.

Update: 2024-10-15 11:35 GMT

సంక్రాంతికి ఎంత క్రేజ్ ఉంటుందో దాదాపు అంతే దసరా సినిమాలకు కూడా ఉంటుంది. ఎందుకంటే రెండు పండగలకు పెద్ద సినిమాలు అనున్నవి పోటీకి దిగుతూంటాయి. దసరా శెలవులు పది రోజులుకు పైగా ఉండటంతో వీటికి ఓ రేంజిలో ఆదరణ ఉంటుంది. అయితే ఆ సినిమాల్లో ఏది బాగుందో వాటిని ఎంచుకుని చూస్తున్నాడు ప్రేక్షకుడు. అదే విధంగా ఈ పండగలకు OTT పోటీ కూడా ఈ సినిమాలకు ఉంటుంది. ఇంట్లో కూర్చుని కాలు బయిటపెట్టకుండా, వర్షాల్లో కూడా దసరా సినిమాలకు రావాలంటే గట్టి కంటెంటే అవసరం. ఈ క్రమంలో 2004 దసరాకు వరసపెట్టి చిన్నా, పెద్దా సినిమాలు భాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టాయి. అయితే చిత్రంగా దసరా ముందే రిలీజైన దేవర మాత్రమే కలెక్షన్స్ సాధించుకుంది. మరి మిగతా సినిమాలకు ఏమైంది. ఎక్కడ ఈ సినిమాలు దెబ్బ తిన్నాయి. ఎందుకు జనం వాటిని పట్టించుకోలేదు, దర్శక,నిర్మాతలు ఈ దసరా నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి.

ఈ దసరాకు థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ లో గోపీచంద్ నటించిన విశ్వం, రజనీకాంత్ వేట్టయన్, సుహాస్ జనక అయితే గనక, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయి.ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ వీకెండ్ మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో వచ్చినవి కాగా.. మరికొన్ని తమిళం, హిందీ, కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు కావడం విశేషం. మరి ఆ మూవీస్ పరిస్దితి ఏంటంటే...

దసరా సందర్బంగా విడుదలైన సినిమాలలో కొన్ని అసలు భాక్సాఫీస్ వద్ద మినిమం ప్రభావం చూపలేదు. ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ షాకర్ సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా కనిపించినప్పటికీ, సినిమాను ప్రేక్షకులు తీవ్రంగా తిరస్కరించారు. థియేటర్లలో కనీస ప్రేక్షకులు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా షోలు రద్దయ్యాయి. శ్రీను వైట్ల విశ్వం సినిమాతో వరుసగా ఐదో ఫ్లాప్‌ని అందించాడు. ఈ చిత్రం శుక్ర, శనివారాల్లో మంచి వసూళ్లను రాబట్టగలిగింది, అయితే బ్రేక్‌ఈవెన్‌ను చేరుకోవడం చాలా కష్టమని తేలిపోయింది. సూపర్ హిట్ అని నిర్మాతలు ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ అంత సీన్ లేదని సాధారణ ప్రేక్షకుడు సైతం గమనించేసాడు. గోపీచంద్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమా అని తిరస్కరించేసారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సినిమా జానక అయితే గనకను భారీ ఎత్తున ప్రమోట్ చేశాడు. పలు ఈవెంట్స్ నిర్వహించి, క్రేజ్ క్రియేట్ చేసి ఈ చిన్న సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువచ్చారు. అయితే ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అసలు పట్టించుకోలేదు. ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. సుహాస్ థియేట్రికల్ హిట్ సాధించాలని ఇంట్రస్ట్ గా ఉన్నాడు . అందుకు దిల్ రాజు వంటి నిర్మాత , కామెడీ చిత్రం అతను జానక అయితే గనక సరైనదని భావించాడు. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తీవ్రంగా తిరస్కరించటం పెద్ద నిరాశ. అయితే దిల్ రాజు వంటి నిర్మాతకు ..ఈ సినిమాపై పెట్టిన ఖర్చు డిజిటల్ ద్వారా మాగ్జిమం రికవరీ చేస్తుంది. దాంతో ఆయన వైపు పెద్దగా చెప్పుకోదగ్గ సమస్య లేదు. కానీ హీరో సుహాస్ కు కొత్త దర్శకుడుకి ఈ సినిమా వల్ల ఏమీ కలిసొచ్చింది లేమీ లేదు.

ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ చిత్రం భారీ స్థాయిలో విడుదలైంది. ఆ చిత్రం కూడా అంతగా భాక్సాపీస్ దగ్గర ఇంపాకట్ చూపలేదు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి మరియు ఫహద్ ఫాసిల్ వంటి నటీనటులు ఉన్నప్పటికీ, పండుగ సమయంలో ప్రేక్షకులు సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. సరైన సినిమా రాకపోతే ప్రేక్షకులు థియేటర్లకు పరుగెత్తడానికి సిద్ధంగా లేరని సెలవుల సీజన్ నిరూపించింది. కొంతమంది ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లే బదులు OTT ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలను చూడాలని నిర్ణయించుకున్నారు.

ఇక కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా నటించిన మూవీ మార్టిన్ శుక్రవారం (అక్టోబర్ 11) రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యింది. దీంతో తెలుగులోనూ వచ్చింది. దీనికి మినిమం ఓపినింగ్స్ కూడా లేదు. కన్నడంలోనూ అదే పరిస్దితి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన జిగ్రా కూడా శుక్రవారమే (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ అండంతో ఈ సినిమాను కూడా తెలుగులో భారీగా రిలీజ్ చేసారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఓ అక్క చేసే ప్రయత్నమే ఈ జిగ్రా మూవీ. ఈ సినిమాని హిందీలోనూ, తెలుగులోనూ, దేశ వ్యాప్తంగా డిజాస్టర్ అయ్యింది.

ఏదైమైనా సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు సెలవు సీజన్‌లో ప్రేక్షకులకు దేవర మొదటి ఎంపిక గా మారింది. అన్ని చిత్రాలకు సోమవారం అంకెలు చాలా దారుణంగా ఉన్నాయి . అవి థియేటర్లలో మొదటి వారం రన్ పూర్తి చేయడానికి ఇబ్బందిపడుతున్నాయి. ఈ సంవత్సరం అనేక హాలిడే సీజన్‌ల మాదిరిగానే, దసరా సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా వేస్ట్ అయ్యింది. రెగ్యులర్‌ సినిమాలు చేయాలనే హడావుడిలో ఉన్న దర్శకనిర్మాతలకు ఇదో గుణపాఠం గా చెప్పాలి. కంటెంట్ ఈజ్ కింగ్ అనేది మరో సారి ప్రూవ్ అయ్యింది. ఓటిటిలో రిలీజ్ చేయాల్సిన సినిమాలను థియేటర్ కు తెచ్చినా ఉపయోగం లేదు. సినిమా ప్రారంభించేటప్పుడే అది ఓటిటి కంటెంటో లేక థియోటర్ కంటెంటో లేక అసలు దేనికీ పనికిరాని కంటెంటో కరుణ్ జోహార్ వంటి పెద్ద నిర్మాత, దిల్ రాజు వంటి కంటెంట్ మీద అవగాహన మరో పెద్ద నిర్మాత కూడా చిత్రంగా తెలుసుకోకపోవటం ఆశ్చర్యం.

Tags:    

Similar News