అదా శర్మ 'C D'OTT మూవీ రివ్యూ!

ప్రధాన పాత్రలో హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? ఈ హార‌ర్ మూవీ చూడదగ్గ సినిమానేనా? ఈ సినిమాతో అదా శ‌ర్మ‌కు హిట్టు ద‌క్కిందా? లేదా?

Update: 2024-10-31 03:00 GMT

హారర్ థ్రిల్లర్ మూవీస్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే హారర్ కాస్తా కామెడీ అయిపోతుంది. అలాగని దాన్ని హారర్ కామెడీగా ప్రమోట్ చేయలేరు. అయితే ఈ హారర్ థ్రిల్లర్ తక్కువ లొకేషన్స్, తక్కువ మంది ఆర్టిస్ట్ లతో చేసేయచ్చు కాబట్టి తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్లు ఇటు వైపు ఆలోచిస్తుంటారు. అలా ఓటీటిలో క్రేజ్ ఉన్న అదాశర్మను తీసుకొచ్చి సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) అనే సినిమా చేసారు. తెలుగులో ఆమె ఈ మద్యన సినిమా చేయటం లేదు. అప్పట్లో తెలుగులో హార్ట్ ఎటాక్‌, క్ష‌ణం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తితో పాటు ప‌లు సినిమాలు చేసింది అదాశ‌ర్మ‌. అయితే కేరళ స్టోరీతో ఆమె ఓటీటీలో హాట్ ప్రాపర్టీ అయిపోయింది. దాంతో ఇన్నాళ్లకు అదాశ‌ర్మ సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్‌) మూవీతో తెలుగు రీఎంట్రీ ఇప్పించారు. ఆమె ప్రధాన పాత్రలో హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉంది. ఈ హార‌ర్ మూవీ చూడదగ్గ సినిమానేనా, ఈ సినిమాతో అదా శ‌ర్మ‌కు హిట్టు ద‌క్కిందా? లేదా?

కథేంటి

డబ్బున్న కుటుంబంలో పుట్టిన సిద్దు (విశ్వాంత్)కు ద‌య్యాలంటే భ‌యం. ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌టానికి కూడా భయపడుతూంటాడు. అలాంటివాడు ఓ రోజు తన అమ్మానాన్నలు పెళ్లి కోసం ఊరికి వెళ్ల‌డంతో ఒక్క‌డే ఇంట్లో ఉంటాడు. దానికి తగినట్లు దెయ్యాలంటే భయమున్నా సరే అనుకోకుండా డెవిల్ అనే దెయ్యం సినిమా తెచ్చుకుని చూస్తాడు.ఆ సినిమాలోని ద‌య్యం త‌న‌ను వెంటాడుతున్న‌ట్లు, చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు భ్ర‌మ‌లు మొదలవుతాయి. ఆ ఇంట్లో తాను కాకుండా మరెవరో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

అదే సమయంలో సిటీలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఈ కిడ్నాప్ లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ (భరణి శంకర్) రంగంలోకి దిగుతాడు. అయితే సిటీలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటుంది లేడీ సైకో రక్ష (అదా శర్మ) . ఆమెను ప‌ట్టుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లించ‌వు. ఐ విల్ కిల్ యూ అని రాస్తూ మరీ అందరినీ ర‌క్ష కిడ్నాప్ చేస్తుంటుంది.

ఇదిలా ఉంటే సిద్ధూ బయట జరుగుతున్న కిడ్నాపుల గురించిన న్యూస్ వింటాడు. ఇంతలో ఎదురింటి అంకుల్ - ఆంటీ ఇంటికి వచ్చిన వచ్చానని చెప్తూ రక్ష (అదా శర్మ) సిద్ధూ ఇంటి తలుపు తడుతుంది. వాళ్లు వచ్చే వరకూ తమ ఇంట్లో ఉండొచ్చునని అతను అంటాడు. ఆ తర్వాత నుంచి ఆమె ప్రవర్తన అతనికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆమె దెయ్యమేమో అని భయపడుతూంటాడు. అప్పుడేం జరిగింది. అయితే ఆమె ఒంట‌రిగా ఉన్న సిద్ధును వెతుక్కుంటూ ఎందుకు రక్ష వచ్చింది. సిద్ధు ద‌గ్గ‌ర‌కు సైకో రక్ష రావ‌డానికి కార‌ణం ఏమిటి? సిద్ధుకు ఉన్న సమస్య ఏంటి? సిద్దు గురించి ర‌క్ష‌...ర‌క్ష గురించి సిద్ధు ఒక‌రికొక‌రు తెలుసుకున్న నిజానిజాలేమిటి అన్న‌దే సీడీ (క్రిమిన‌ల్ ఆర్ డెవిల్) మూవీ క‌థ‌.

ఎలా ఉంది

అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ఊర్మిళను ప్రధాన పాత్రలో పెట్టి కౌన్ అనే సినిమా చేశారు. ఇది అలాంటి ప్రయోగమే. కాకపోతే కౌన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా బోరింగ్ గా ఉంటుంది. అప్పటికి ఆ జానర్ కొత్త. ఇన్నేళ్లలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చేసి జనాలను చావ కొట్టేసాయి. దాంతో కొత్తదనం ఫీలవరు. అక్కడికి వచ్చిన అదాశర్మ దెయ్యమైనా, సైకో అయినా మరకరు అయినా నాకేంటి అనిపిస్తుంది చూసేవాళ్ళకు. అంత నిరాశక్తి గా తీసినట్లు అనిపిస్తుంది. అయితే ప్రధానపాత్రలకు క్లైమాక్స్‌లో ద‌ర్శ‌కుడు రాసుకున్న ట్విస్ట్ మాత్రం బాగుంది. అమ్మాయిల మిస్సింగ్ వెనుక‌న్న మ‌లుపు మాత్రం స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.రొమాన్స్‌ను మిక్స్ చేస్తూ హార‌ర్ సీన్స్‌తో ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌ను న‌డిపించాడు.కేవ‌లం క్లైమాక్స్ ట్విస్ట్ కోస‌మే క‌థ‌ను అంత సేపు భరించటం కష్టం. హార‌ర్ ఎలిమెంట్స్ అంత‌గా భ‌య‌పెట్ట‌లేక‌పోయాయి. ఉన్నంతలో అదా శర్మ బాగా చేసింది. జబర్దస్త్ రోహిణి కాసేపు నవ్వించింది. అంతకు మించి సినిమాలో చెప్పుకోదగిన విశేషం ఏమీ లేదు.

చూడచ్చా

అదాశర్మకు వీరాభిమానులు అయితే ఖచ్చితంగా చూడాలి. మిగతా వాళ్లకు సో సో అనిపిస్తుంది.

ఎక్కడ చూడచ్చు

ఆహా లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News