నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 19
2024-06-04 03:42 GMT

విజయవాడ, రాజమండ్రి, నరసరావుపేట, తిరుపతి, హిందూపురం, అనకాపల్లి, గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

2024-06-04 03:42 GMT

హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యం.. మొదటి రౌండ్‌లో 1,880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ.. గుడివాడలో టీడీపీ ముందంజ

2024-06-04 03:36 GMT

పోస్టల్ బ్యాలెట్ లోకసభ తిరుపతి 462 ఓట్ల ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరప్రసాద్

2024-06-04 03:36 GMT

నంద్యాలలో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం

నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రత్యర్థిపై 2,385 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

2024-06-04 03:33 GMT

దూసుకెళ్తున్న టీడీపీ


ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ దూసుకెళ్తోంది. 20 స్థానాల్లో ఆధిపత్యం కనబరుస్తోంది. జనసేన కూడా 4 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా వైసీపీ మాత్రం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది.

2024-06-04 03:29 GMT

చిత్తూరులో తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ 1311 ముందంజ

2024-06-04 03:28 GMT

తిరుపతి పార్లమెంట్ స్థానం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏం.గురుమూర్తి ఆధిక్యం

తిరుపతి అసెంబ్లీ స్థానం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఆధిక్యం

చంద్రగిరి అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధిక్యం

2024-06-04 03:17 GMT

తొలి రౌండ్లో పవర్ చూపిన పవన్

పిఠాపురం కౌంటింగ్‌ తొలి రౌండ్లో పవన్ కల్యాణ్ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగాగీతపై పవన్ ‌స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతున్నారు. 

2024-06-04 03:16 GMT

ఆంధ్రలో ఎన్‌డీఏ కూటమి హవా


ఆంధ్ర లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్‌డీఏ కూటమి హవా సాగుతోంది. కౌంటింగ్‌లో ఎన్‌డీఏ కూటమి రెండు స్థానాల్లో ఆధిక్యంలో సాగుతోంది. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో ఆరు స్థానాల్లో కూటమి ముందుంజలో సాగుతోంది.

2024-06-04 03:13 GMT

కుప్పంలో బాబే టాప్


కుప్పంలో చంద్రబాబు నాయుడు దూసుకెళ్తున్నారు. 1549 ఓట్ల ఆధిక్యంతో చంద్రబాబు ముందంజలో ఉన్నారు.

నెల్లూరులో కూడా టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం కనబరుస్తున్నారు.

Tags:    

Similar News