పిఠాపురంలో చెల్లని ఓట్లే ఎక్కువ
పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. పిఠాపురంలో 2,423 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి. చెల్లని ఓట్లు అధికంగా ఉండటంతో ముందుగా వాటిని వేరు చేస్తున్నారు అధికారు. వాటిని వేరు చేసిన తర్వాత లెక్కింపు మొదలవుతుంది.
ముందంజలో టీడీపీ
ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచే టీడీపీ జోరు కనబరుస్తోంది. టీడీపీ రాజమండ్రి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. ఆయన 900 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
ఇడుపులపాయలో షర్మిల ప్రార్థనలు
కౌంటింగ్ మొదలైన సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ దగ్గర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రార్థనలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రానికి బయలు దేరుతున్న సందర్భంగా ఆమె వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించారు.
మొదలైన కౌంటింగ్
ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓట్ల లేక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ సహా లోక్‌సభ ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి చేయనున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారమే లెక్కింపు జరుగుతుందని అధికారులు చెపతున్నారు. కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఉదయం 8:30 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభించనున్నారు.
భారీ విజయం పక్కా
ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని చూడబోతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి సృజన చౌదరి ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రాబొతున్నాయి. ఈ విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ఘంటాపథంగా చెప్తున్నాయి’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
స్ట్రాంగ్ రూమ్‌లను తెరిచిన కలెక్టర్
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంకు చెందిన ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌లను అబ్జర్వర్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీయం అభిషిక్త్ తెరిచారు.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంకు చెందిన ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్‌లను అబ్జర్వర్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో #Kadapa జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీయం అభిషిక్త్ తెరిచారు.#APElectionPrediction #Counting pic.twitter.com/AQBxAwSbYC
— Subbu (@Subbu15465936) June 4, 2024