తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు హైవే వేసింది కొ.కు యే...

నేడు ప్రముఖ రచయిత హేతువాది కొడవటి గంటి కుటుంబరావు 45వ వర్ధంతి

By :  Admin
Update: 2024-08-17 06:50 GMT

చందమామ మాసపత్రిక సంపాదకులుగా, ఆంధ్ర పత్రిక, యువ పత్రికలో జర్నలిస్టుగా అవిరళ కృషి చేసిన కొడవటి గంటి కుటుంబరావు (కొకు) 45వ వర్ధంతి సందర్భంగా జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ నివాళులు అర్పించింది.

1909 అక్టోబర్ 28న సామాన్య కుటుంబంలో తెనాలిలో జన్మించిన కొడవటీగంటి కుటుంబరావు బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ వద్ద పెరిగినారు. ప్రాథమిక విద్య తెనాలిలో, ఇంటర్మీడియట్ గుంటూరు ఏసీ కళాశాలలో , గ్రాడ్యుయేషన్ విజయనగరంలోని మహారాజా కళాశాలలో అభ్యసించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదువుతూ మద్యలోనే ఆర్థిక సమస్యలతో అర్ధ0తరంగా చదువును మానేశారు.

తన 13వ వయసులోనే పద్యాలు, నవల రచనకు పూనుకున్నారు. హేతువాద దృక్పథంతో శాస్త్రీయ భావజాలాన్ని ప్రజలకు అందించారు. 1931లో వరంగల్ లో పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణ లతో కలిసి యువ పత్రికను స్థాపించారు. 1940-42 మద్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేశారు. 1952 నుండి తాను చనిపోయే వరకు చందమామ సంపాదకులుగా వ్యవహరించారు. చక్రపాణి, బి. నాగిరెడ్డిలతో కలిసి చందమామను బాలల మాసపత్రిక గా తీర్చిదిద్దారు. విద్యార్థులలో హేతువాద దృక్పథం పెంపొందించడానికి అవిరళ కృషి చేశారు. ఎన్నో నవలలు, కథలు, వ్యాసాలు, తెలుగు సమాజానికి అందించి సాహిత్యం విమర్శు, వ్యాసాలు, కథలు ఎలాసాగాలో చూపించారని చెబుతూ కొడవటిగంటి కుటుంబరావు 45వ వర్ధంతి సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి నివాళులు తెలిపారు.

కొకు రచనల గురించి...

చాలా చిన్న వయసులోనే ఆయన రచనా వ్యాసంగం ప్రారంభంయింది. 13 ఏళ్ళకే సస్పెన్స్ థ్రిల్లర్ రాశారు. ప్రారంభిన కొడవటిగంటి కుటుంబరావు 12 వేలకు పైగా రచనలు చేశారని చెబుతారు. ఆయన రచనల్లో లేని ప్రక్రియ లేదు,కవిత్వం తప్ప. ఆయన నవలలు, చిన్న కథలు, దిబ్బ కథలు, శాస్త్రవిజ్ఞాన కల్పనా కథలు, హపూర్వ హపరాధ పరిశోధక కథలు, హాస్య, వ్యంగ్య కథలు, గల్పికలు, నాటికలు, వాస్తవిక రచనలు, అనువాదాలు ఉన్నాయి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన రచయితగా ఆయన గుర్తింపుపొందారు.

తెలుగు నాట వచ్చిన అభ్యుదయ సాహిత్య ఉద్యమాలలో ఆయన జీవితం ముడివడి ఉంది.. దీనిలో భాగంగా నవ్య సాహిత్య పరిషత్, ఫోరమ్ ఫర్ మోడరన్ లిటరేచర్ సభ్యుడుగ ఉంటూవచ్చారు. తర్వాత మార్క్సిజం ప్రభావంతో 1940లో అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. దాని పనితీరు పట్ల అసంతృప్తితో, అతను 1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) లో చేరి తన చివరి వరకు దాని ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. కొ.కు విశ్లేషణ మార్క్సిస్టు ఫిలాసఫీతో సాగుతుంది. ఆలోచనను రేకెత్తిస్తుంది. మూఢ విశ్వాసాలు, అజ్ఞాన, దిగజారుడు పోరాటానికి ఆయన పిలుపునిచ్చారు. అందుకే ఆయన భాష సరళంగా సూటిగా ఉంటుంది. ఆయన ప్రతిపాదించిన బుద్ధి కొలతవాదంను తెలుగునాట పెద్ద చర్చకు దారితీసింది.



Tags:    

Similar News