గుర్రప్ప కొండ ఎక్కడం కష్టం.. ఎక్కితే ఆనందం..

తిరుపతి 30 కిమీ దూరాన ఉన్న గుర్రప్పకొండ గస పెడుతూ, పాకుతు, లేస్తూ చేరుకోవాలి. చేరుకున్నాక అలసట తర్వాత అంతా ఆహ్లాదమే. చరిత్రకారుడు భూమన్ ట్రెక్ అనుభవం

Update: 2024-05-12 06:38 GMT

ఒకప్పుడు ఎందరో పర్యాటకులకు అలసటను తీర్చిన కొండ గుర్రప్ప కొండ. కానీ ఇప్పుడు పట్టించుకునే నాథుడు లేక పాడైపోయింది. ఇలాంటి పురాతన సంపద శిథిలంగావడం చూస్తుంటే మనసు తరుక్కుపోతోందని ట్రెక్కర్ భూమన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గుర్రప్ప కొండు ఎక్కెటప్పుడు అలసల ముంచుకొచ్చినా.. ఎక్కిన తర్వాత మాత్రం అంతా ఆహ్లాదమే అంటూ తన ట్రెకింగ్ అనుభవాలను పంచుకున్నారాయన. తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుర్రపకు కొండకు ముచ్చటగా మూడోసారి వచ్చానని ఆయన చెప్పారు. ఈ కొండను తనకు అటవీశాఖ ఉద్యోగి వెంకటరెడ్డి పరిచయం చేశారని, అప్పటి నుంచే ఇక్కడి గ్రామస్తులతో కూడా అనుబంధం ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ఆ గ్రామంలో ఉండే అప్పిరెడ్డి, విజయ పదేపదే తనను అక్కడకు రమ్మంటారు, వారి కోరికమేరకే మూడోసారి గుర్రప్ప కొండను ఎక్కడానికి బయలుదేరానంటూ తన మూడో ప్రయాణానికి సంబంధించి అంశాలను వివరించారాయన.

‘‘గంగుడు పల్లె నుంచి కిలోమీటరు దూరం వరకు ఉన్న ఎగుడుదిగుడు దారి గుండా ట్రాక్టర్, బైకు అంటూ వాహనాలు మారుతూ ఎట్టకేలకు గుర్రప్పకొండ చేరుకున్నాం. చుట్టూ కొండలే.. ఎదురుగా జెర్రిపోతు కోన, పక్కనే పులిబాన ఉన్నాయి. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆకాశాన్ని మబ్బులు కమ్ముతూ సన్నని చినుకులు పడుతుంటే మనసును ఆనందం కమ్మేస్తుంది. అసలే నాకు వర్షంలో అడవిలో, కొండల్లో ప్రయాణించడం అంటే మహాఇష్టమాయే. అక్కడక్కా సన్నటి నీటిధార దూకుళ్లు, పక్కన పక్షుల కిలకిలారావాలు. అల్లంత దూరంలో అడవి కోళ్ల అందాలు అబ్బో ప్రయాణం మజామజాగా సాగింది’’ అంటూ తన ట్రెక్కింగ్ విశేషాలను పూస గుచ్చి చెప్పారు.


ఆయన యాత్రకు సంబంధించిన పూర్తి అనుభవాలను ఇక్కడ చదవండి.

Tags:    

Similar News