సాహితీవేదిక పురస్కారం 2025
ఇరవై వేల రూపాయల నగదుతో అద్దేపల్లి ప్రభుకి పురస్కారం
రాజమండ్రి సాహితీవేదిక ఈ సంవత్సరం నుండి తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన, చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం ఇవ్వ తలపెట్టిన సాహిత్య పురస్కారం మొదటిసారిగా ఈ 2025 సంవత్సరానికి... అభివృద్ధి- విధ్వంసాల నడుమ ఉన్న విరోధాభాసను శక్తివంతంగా చూపిస్తూ, ప్రపంచీకరణ, సాంకేతికత, పర్యావరణ సమస్యలతో కూడిన క్లిష్టమైన వర్తమానాన్ని తన సరళమైన శిల్పనైపుణ్యంతో ఆవిష్కరిస్తూ, చేతనను వివేచనను కలిగించే మానవ జీవన కోణాల్ని అందులోని విషాదాన్ని శక్తివంతంగా కథల్లోకి కవిత్వంలోకి వొంపుతూ తెలుగు సాహిత్యానికి ఒక చేర్పునిస్తున్న అరుదైన కవీ, కథకుడూ కాకినాడకు చెందిన అద్దేపల్లి ప్రభుకు ప్రకటిస్తున్నది.
దాదాపు ముప్పై కథలు, వంద వరకూ కవితలు, రెండు దీర్ఘ కవితలు రాసిన అద్దేపల్లి ప్రభు ఆవాహన, పారిపోలేం, పిట్టలేనిలోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటుల్ని,
సీమేన్ కథా సంపుటిని ప్రచురించారు
డిసెంబరు 25, 2025 న రాజమండ్రిలో జరిగే సాహితీవేదిక వార్షిక సమావేశంలో అద్దేపల్లి ప్రభుకు యిరవై వేల రూపాయల నగదుతో పురస్కారం ప్రదానం చేయబడుతుంది. .
సాహితీవేదిక
రాజమండ్రి