జపాన్ జంట ఫస్ట్ నైటు.. మా గూగుల్ డే(టా)టు..

విశాఖ డేటా సెంటర్ ఎలా ఉంటుందో చెప్తా, చదివి తరించండంటున్న మానవ హక్కుల వేదిక నేత మార్పు శరత్

Update: 2025-10-28 07:07 GMT
ప్రతీకాత్మక చిత్రాలు
(మార్పు శరత్)
మా తర్లువాడ ఊరు ఊరంతా సందడిగా ఉంది.. అందరూ కొలతల టేపులు పట్టుకుని పొలాల చుట్టూ తిరుగుతున్నారు.  కోళ్లు తెగుతున్నాయి రాత కోతలు మిన్నంటుతున్నాయి. అక్కడ స్థలం ఇంత, ఇక్కడ పొలం ఇంత.. మీ అబ్బాయి కట్నం ఎంత, మా అమ్మాయి జీతమింత అంటూ కోతలరాయుళ్లు కూత పెడుతున్నారు. ఒక్కడికీ భుజమ్మీద పైపంచ ఆగడం లేదు. లక్షల్లో ఉద్యోగాలు, కోట్లల్లో జీతాలు.. అబ్బో అనుకుంటుండగా గబుక్కున నామదిలో మెరిసిందో సీను..
అదే జపాన్ దంపతుల ఫస్ట్ నైట్...
జపాన్ దేశపు ఓ అబ్బాయి ఓ అమ్మాయి పెళ్ళి నిశ్చయమైన రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి రానే వచ్చింది.  అచ్చం మా  డేటా సెంటర్ లాగే...
అమ్మాయి ఒక చేతిలో వైన్ గ్లాస్ పెట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది.
భర్త చిరునవ్వుతో అడిగాడు. సుతాకి?
ఆమె wine ఇస్తూ సిగ్గుతో చెప్పింది "కొద్వానిని"?
భర్త ప్రేమతో చిరు కోపం వచ్చేలా అన్నాడు...
డోకో అన్వి తోడి రూమి హొవాయాకి?
దానికి ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది...
"మిమియో మాకోడిండ
"
భర్త మళ్లీ నవ్వుతూ అన్నాడు "నా మియ్జ కినాటిన్ కౌఝి"
అందుకు ఆమె నవ్వుతూ వయ్యారంగా చెప్పింది...
"సు కి కినా మాటొ"
అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడు... "సాకోటిటి యేమి చీ"
అందుకు ఆమె నవ్వుతూ , జయో జిబయో అన్నది
...
నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలి.
ఒక్క ముక్క అర్థం కాక పోయిన ‘ఫస్ట్ నైట్’ అనే సరికి ఎంత ఓపిగ్గా చదివారో...
మా వైజాగ్లో రాబోయే డేటా సెంటర్ కూడా అలాగే ఉంటుంది. చదవడానికి ఆసక్తి గా... కానీ బాబు గారు, తనయుడు లోకేశం చెప్తున్నట్టుగా లక్షలు ఉద్యోగాలు రావు. రానే రావు.
ప్రపంచవ్యాప్తంగా 11,800 డేటా సెంటర్లో ఉంటే అందులో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2.3 మిలియన్లు. అంటే 23 లక్షలు. సగటున ఒక్కో డేటా సెంటర్లో 197 మంది పనిచేస్తున్నారు. ఈ పుంజుడు ఉద్యోగాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది, రాయితీలుగా ఇస్తున్నది మొత్తం రూ.28 వేల కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులకు డి.ఏ నే వాయిదాల్లో చెల్లిస్తున్న పరిస్థితుల్లో వేలకోట్లు నిధులెలా వస్తాయి?. ప్రజలపై పడబోయే భారం ఎంత?
అంతా
మషీబూషి - మాయాషేషి కార్పొరేట్లకు అప్పషేప్పి... వారిచ్చే కమిషన్లు కోసం మిట్సుబీషి... అదానీజోషి.. తోషీబా!
కొన్నిషివా.. こんにちは, Konnichiwa అంటే నమస్కారం.

 

(రచయిత మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడు, రచయిత, విశ్లేషకుడు)
Tags:    

Similar News