2024 లో మోదీ మ్యాజిక్ ఎమైంది: రాజ్‌దీప్ సర్దేశాయ్ ఏమన్నారంటే
సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నినాదం 'అబ్కీ బార్ చార్ సౌ పర్' ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. కాని అంచనాలు తలకిందులయ్యాయి. పార్టీ శ్రేణులను నిరాశ పరిచాయి.
భారతదేశంలో ఎన్నికలు ఎప్పుడూ ఒక దృశ్యం. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నినాదం 'అబ్కీ బార్ చార్ సౌ పర్' ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో అత్యధిక మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంటామని బీజేపీ అగ్రనేతలు ప్రచార సభల్లో విశ్వాసంగా ప్రకటించారు. ప్రధాని మోదీ మునుపటి కంటే ఎక్కువ స్థానాలతో అధికారాన్ని కొనసాగిస్తారని చాలా మంది భావించారు. కాని అంచనాలు తలకిందులయ్యాయి. పార్టీ శ్రేణులను నిరాశ పరిచాయి. మోదీ గెలిచి ప్రధానిగా అయితే కొనసాగుతున్నారు. కాస్త వెనుతిరిగి చూస్తే..బీజేపీ హై డెసిబెల్ ప్రచారానికి అనేక విధాలుగా ఎదురుదెబ్బ తగిలింది. చాలా మంది బీజేపీ కార్యకర్తలను ఉత్సాహపరిచే బదులు సంతృప్తి మిగిల్చింది. బీజేపీ పార్లమెంటులో 400 కంటే ఎక్కువ మంది గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందనే భయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు 'సంవిధాన్ ఖత్రే మే హై' అంటూ పట్టణాల్లో ప్రచారం మొదలెట్టాయి. దాంతో బీజేపీ బలం తగ్గింది. 242 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోగలిగారు. ఇది మునుపటి సంఖ్య 303 కంటే చాలా తక్కువ. ఇక అధికారంలో కొనసాగాలందే మరి కొన్ని స్థానాలు అవసరం. ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను చెంతన చేర్చుకున్నారు.
500 పేజీల పుస్తకంలో ఎన్నో ఘటనలు..
ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన భారీ పుస్తకం ‘‘2024: భారతదేశాన్ని ఆశ్చర్యపరిచిన ఎన్నికలు.’’ దాదాపు 500 పేజీలున్న ఈ పుస్తకంలో రాజ్‌దీప్ 2024లో చోటుచేసుకున్న కొన్ని రాజకీయ ఘటలను ఇందులో చెప్పుకొచ్చారు. పెద్ద, సంచలనాత్మక ప్రకటనలు ఆశించే వారికి ఈ పుస్తకం నిరాశ కలిగించవచ్చు. ప్రస్తుతం 24/7 టెలివిజన్ ఛానెల్‌లో పని చేస్తున్న హార్డ్-నోస్డ్ రిపోర్టర్-యాంకర్‌గా పేరుగాంచిన రాజ్‌దీప్ తరచుగా గ్రౌండ్ రిపోర్టు చేస్తుంటారు.
'అబ్కీ బార్ చార్ సౌ పర్' నినాదం బీజేపీని నిలదీసిందనే చెప్పాలి. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు JP నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నినాదాన్ని జనంలోకి విజయవంతంగా తీసుకెళ్లినా.. 400 సీట్లు సాధించడం అసాధ్యమని పార్టీ అంతర్గత సర్వేలు తేల్చాయి.
బీజేపీ లక్ష్యంగా రాహుల్..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ లక్ష్యంగా ' మొహబ్బత్ కి దుకాన్' అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక యువకుడు అతనిని కలవడానికి వచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నాడు. భద్రతా వలయాన్ని ఛేదించి ఆ వ్యక్తిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి కన్నీళ్లతో రాహుల్‌కు చాలా కృతజ్ఞతలు చెప్పాడు.
షా కాలేజీ రోజుల గురించి..
పుస్తకంలో అలాంటి దాచిన రత్నాలు చాలా ఉన్నాయి. ఒకదానికంటే మరొకటి మెరుగ్గా ఉండవచ్చు. ఆధునిక చాణక్యుడిగా పేరున్న షా గురించి రాజ్‌దీప్ తన పుస్తకంలో ఇలా రాసుకొచ్చారు. షా కళాశాల ఎన్నికలలో పోటీ చేసినప్పుడు.. మహిళ అయిన తన ప్రత్యర్థిపై గెలవడానికి ఒక వ్యూహం పన్నారు. ఓటింగ్ రోజున కాలేజీలో గొడవలు జరిగే అవకాశముందని కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిల కుటుంబాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వెళ్లాయి. దాంతో కొంతమంది తల్లిదండ్రులు ఓటింగ్‌కు వెళ్లనివ్వలేదు. దాంతో షా గెలిచిపోయారు.
రాజకీయాలపై ప్రభావం చూపిన అంశాలెన్నో..
రాజకీయాలపై అమిత ప్రభావం చూపిన ఘటనల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు రాజ్‌దీప్. ముఖ్యంగా CAA నిరసనలు, ఢిల్లీ అల్లర్లు, రైతుల ర్యాలీలు, మహిళా రెజ్లర్ల ఆందోళనలు సహా - 2019, 2024 మధ్య జరిగిన కొన్ని ఘటనలను తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఆయన లోతుగా పరిశోధించిన రాసిన ఈ పుస్తకం చాలా మందికి నచ్చుతుంది. అయితే బీజేపీతో జతకట్టిన వారి నుంచి వ్యతిరేకత కూడా రావొచ్చు. మణిపూర్ సంక్షోభం, వివాదాల సమయాల్లో "మోదీ తప్పించుకునే వ్యక్తిగా, బాధ్యతారహితంగా వ్యవహరించారని" పుస్తకంలో చెప్పుకొచ్చారు.
ఈ పుస్తకం విడుదలైన తర్వాత వివేకం గల పాఠకుల నుంచి ప్రశంసలు వచ్చినా.. రాజ్‌దీప్ కొంత వ్యతిరేకత ఎదుర్కోక తప్పదేమో. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అభ్యంతరకర వాట్సాప్ మెసేజ్‌లు పంపి తనను బెదిరించిన తీరును రాజ్‌దీప్ పుస్తకంలో చెప్పుకొచ్చారు. అలాంటి బెదిరింపులు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది.