అనంతపురంలో స్టాన్ స్వామి ‘నేను మౌన ప్రేక్షకుని కాను’ ఆవిష్కరణ

రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు అరుణ్ దీనిని తెలుగులోకి అనువాదం చేశారు.;

Update: 2025-09-08 03:11 GMT

అనంతపురం నగరంలో ఆదివారం  సాయంకాలం సెకండ్ రోడ్ లోని గాయత్రి స్కూల్లో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘నేను మౌన ప్రేక్షకుని కాను’ స్టాన్ స్వామి రాసిన ఇంగ్లీష్ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించారు.  రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు అరుణ్  దీనిని తెలుగులోకి అనువాదం చేశారు.

జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసుల కోసం పోరాడిన క్రిస్టియన్ మత ప్రబోధకుడు స్టాన్ స్వామినీ భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఏ ద్వారా అక్రమ కేసు బనాయించి జైల్లో ఉంచారు. ఆయన అక్కడే ఆయన మరణించడం జరిగినది .
ఆయన మరణానికి ముందు తన అనుభవాలలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కోర్టులు ఏ వర్గ ప్రజల కోసం పనిచేస్తున్నాయి అవి ప్రజాస్వామిక వాదుల గొంతులను ఏవిధంగా అణిచివేస్తున్నాయని అనే విషయాలను ఆయన ‘నేను మౌన ప్రేక్షకుని కాను’ అని ఇంగ్లీషులో రాసుకున్న విషయాలను పుస్తక రూపంలో రావడం జరిగినది .
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఏపీ సి ఎల్ సి జిల్లా కార్యదర్శి ఆదినారాయణ వహించినారు .
విరసం రాష్ట్ర నాయకులు పాణి , రాయలసీమ విద్యావంతుల వేదిక కార్యదర్శి వెంకటేశ్వర్లు , మానవ హక్కుల వేదిక సీనియర్ నాయకులు చంద్రశేఖర్ , భాష , సుబ్బన్న ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి సురేష్, దావీద్ , నాగరాజు, ఓ పి డియర్ జిల్లా సహాయ కార్యదర్శి అడ్వకేట్ ప్రకాష్ మాదిగ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు పసులూరు ఓబులేసు , ప్రజా కళామండలి నాయకులు చంద్రప్ప ప్రజాసంఘాల నాయకులు. తదితరులు పాల్గొనడం జరిగినది .


Tags:    

Similar News

అమ్మ చీర