ఎస్‌బీఐ సరికొత్త స్కీమ్..లక్ష కావాలంటే ఇలా ట్రై చేయండి..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్‌పై అవగాహన, వాటిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది.;

Update: 2025-01-06 11:16 GMT

ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్‌పై అవగాహన, వాటిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. యువత చాలా మంది తమకు వచ్చే సంపాదనలో కొంత స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టడానికి ఆలోచిస్తున్నారు. కానీ డబ్బు పోతేనో? అన్న భయంతా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ‘హర్ ఘర్ లఖ్‌పతి’ పేరిట తన డిపాజిట్లు పెంచుకోవడంతో పాటు ప్రజలకు మంచి అవకాశం కల్పించడానికి సరికొత్త రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో ఎంచుకున్న కాలవ్యవధికి ప్రతి నెలా ఈఎంఐ తరహాలో నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఆర్‌డీ అనేది మనం అనుకున్న మొత్తంలో అంటే అది రూ.500 కావొచ్చు, రూ.10,000 కావొచ్చు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో అలా కాదు. ఇందులో మనం మన టార్గెట్‌ మొత్తాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత దానిని రీచ్ కావడానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తూ వెళతాం. ఈ స్కీమ్‌లో లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల పరిమితిని కూడా పెట్టుకుని ప్రీకాలిక్యులేటెడ్‌ మొత్తాన్ని నెలనెల చెల్లించాలి. నిర్ణీత కాలపరిమితి అయిపోయిన తర్వాత మీరు అనుకున్నంత మొత్తం మీ చేతికి అందుతుంది. కాగా.. ఇందులో వడ్డీతో కలిపి మన మొత్తం మనకు వస్తుంది. వడ్డీ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. యువతకు ఒకలా, సీనియర్ సిటిజన్లకు ఒకటా ఉంటుంది.

ఈస్కీమ్‌కు వీరే అర్హులు..

  • ఈ స్కీమ్‌కు భారతీయ నివాసితులు ఎవరైనా తీసుకొచ్చు.
  • దీనిని వ్యక్తిగతంగానే కాకుండా జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు.
  • 10ఏళ్ల వయసు నిండిన మైనర్లు తీసుకోవచ్చు.
  • పిల్లల పేరిట తల్లిదండ్రులు, సంరక్షకులు కూడా తీసుకొచ్చు.
  • ఈ స్కీమ్‌లో అత్యల్పంగా మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు కాలవ్యవధి ఉంటుంది.
  • నిర్ణీత కాలానికి ముందే రూ.5లక్షల లోపు నగదు విత్‌డ్రా చేస్తే 0.50శాతం(ప్రిన్సిపల్ అమౌంట్), రూ.5లక్షల కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఒకశాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
  • నిర్ణీత మొత్తాన్ని సకాలంలో చెల్లించని పక్షంలో రూ.100కు రూ.1.50 చొప్పున పెనాల్టీ విధిస్తారు.
  • వరుసగా ఆరు నెలలపాటు ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించకపోతే ఆ ఖాతాను క్లోజ్ చేస్తారు. అప్పటి వరకు చెల్లించిన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

వడ్డీ రేట్లు ఇలా..

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం రూ.1లక్ష పొందాలంటే మూడు సంవత్సారల కాలపరిమితి పెట్టుకుంటే ప్రతి నెలా రూ.2500 చెల్లించాలి. నాలుగు సంవత్సరాల కాలపరిమితి పెట్టుకుంటే రూ.1810 చెల్లించాలి. మూడు సంవత్సరాలకు 6.75 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఎంచుకున్న వ్యవధిని బట్టి వడ్డీ రేట్లలో మార్పు కూడా వస్తుంది. అదే సీనియర్ సిటిజన్ అయితే మూడేళ్ల కాలానికి రూ.2,480 చొప్పున కట్టాలి. వీరికి 7.25శాతం వడ్డీ లభిస్తుంది. అంటే 50బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తుంది. ఎస్‌బీఐ ఉద్యోగులకు మరో 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ చెల్లిస్తారు.

ప్రతి నెలా ఎంతకట్టాలంటే

వడ్డీ రేట్లు ఇలా

 

 

Tags:    

Similar News