ఏడుపాయల దుర్గమ్మ తొవ్వలో మూడు కొత్త రాతిచిత్రాల స్థావరాలు

కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించిన కొత్త రాతిచిత్రాల తావులు;

By :  Admin
Update: 2025-01-24 07:31 GMT

కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బుర్ర సంతోష్ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో నాగసానిపల్లె, ఏడు పాయల దుర్గమ్మ మార్గంలో నాగసానిపల్లె గుట్టలలో 18.007378 డిగ్రీల రేఖాంశాలు, 78.182086 డిగ్రీల అక్షాంశాలపై రెండుచోట్ల మూడు రాతిచిత్రాల తావు (Rock Art Sites)  లను, అపురూపమైన, అరుదైన రాతిచిత్రాలను గుర్తించాడని కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.    





ఈ ఎరుపురంగు రాతిచిత్రాలలో రంగునింపిన పెద్దబొమ్మ, ఒక చేప, మచ్చల జంతువులు, పెద్ద సూర్యుడు, ఎముక, రెండు కంగారువంటి జంతువులు, మాస్కు ధరించిన ఒక పెద్ద మానవరూపం, వజ్రాకార డిజైన్, జిగ్ జాగ్ గీతలు, నిలువుగీతల డిజైన్లు, పెద్దతోక. పెద్దమెడ, పెట్టెవంటి శరీరం డైనోసార్ వలె కనిపించే ఒక బృహద్రూప మాంసాహార జంతువు.



ఇంకా కొన్ని గుర్తించబడని చిత్రాలున్నాయి. దాదాపు రాతిచిత్రాలన్నీ ఔట్ లైన్ స్కెచెస్ లెక్కనే అగుపించాయి. కొన్ని చిత్రాలు అధ్యారోపణం(ఓవర్ లాపింగ్) చేయబడ్డాయి.

 


రంగులు నింపడం, నైరూప్య చిత్రాలు ఈ రాతిచిత్రాల శైలి, ఎరుపురంగులో చిత్రించబడ్డ పద్ధతి వీటి కాలాన్ని చివరి మధ్యరాతియుగంగా, పదివేల సంవత్సరాల కిందటివిగా గుర్తించవచ్చని రాతిచిత్రాల నిపుణులు, కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు బండి మురళీధర్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News