ష్..! కలెక్టర్లు 'చదువు'కుంటున్నారు!

హద్దు మీరొద్దు, సద్దు చేయోద్దు!!;

Update: 2025-09-16 06:13 GMT
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు కొలువు దీరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి అన్ని విధాలా హితబోధ చేస్తున్నారు. రాష్ట్రానికి మీరే సారథులని చెబుతూ – ఎలా పాలన అందించాలి, జనంతో ఎలా వ్యవహరించాలి అనే క్లాస్ తీసుకుంటున్నారు.

అదే సమయంలో… ఈ 'లెసన్'కి ఎటువంటి ఇరుకు, ఇబ్బంది రాకుండా పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. తనికీ పాయింట్ వద్ద కఠినంగా చెక్ చేస్తున్నారు. బుగ్గ కార్లనూ గాలిస్తున్నారు. లోపలికి ఎవరు పడితే వాళ్లు వెళ్లి ఏది పడితే అది మాట్లాడకుండా – కట్టుదిట్టమైన నియంత్రణ కొనసాగుతోంది.

ఒకవైపు మబ్బులు కమ్మిన ఆకాశం, మరోవైపు సెక్రటేరియట్ గేటు వద్ద పహారా – వాతావరణమే క్రమశిక్షణను సూచించేలా ఉంది.
చేతిలో ఫైళ్లూ, కళ్లలో ఆశలూ పెట్టుకొని లోపలికి వెళ్ళాలని ఎదురు చూస్తున్న జన సన్నివేశం ప్రత్యేకం.
లోపల ‘క్లాస్‌రూం’… బయట ‘వార్ రూం’… మధ్యలో ‘దళారుల’ హల్ చల్..

“రాష్ట్రానికి ఉత్తమ పాలన అందించే వాళ్లకు కాస్తంత గడువివ్వండయ్యా” అంటూ సుతిమెత్తగా చెప్పి తిరిగి పంపుతున్న పోలీసులు.

కాదూ, కూడదని తోకజాడిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేగా.

అదండీ విషయం. దానికి సాక్ష్యమే ఈ ఫోటోలు.
(ఫోటోలు- పి.రవి, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)
Tags:    

Similar News