చిన్న కాలనీలో.. పెద్ద గ్రంథాలయం..
తమ కాలనీలో, తమ ఇంటికి దగ్గిరగా గ్రంథాలయం ఏర్పాటుతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ప్రముఖ కవి పుష్యమీ సాగర్;
-పుష్యమీ సాగర్
కాలనీలో ఆధునిక గ్రంథాలయం అంటే వినడానికి వింతగా ఉంది కదూ. అవును వింతే.
మా కాలనీ, చిన్న కాలనీ. విఐపిలు ఉండే కాలనీ కాదు. హైదరాబాద్ శివారల్లో ఒక చిన్న కాలనీ. అయినా సరే, మా కాలనీలో పెద్ద గ్రంథాయం వెలసింది. దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా.
సాధారణం గా మంచి గ్రంథాలయం లేదా పెద్ద గ్రంథాలయం ఏ నగరంలోనో, ఒక మోస్తరుటవున్ లోనొ ఉంటుంది. కానీ హైదరాబాద్ లోని ఒక మారుమూల కాలనీ, బడంగిపేట,లో ఉంటుందని వూహించడం కష్టం. బడంగి పేట ఆదిభట్ల టాటా ఎయిర్ స్పేస్ కంపెనీ కి వెళ్లే దారి ఉంటుంది. బడంగి పేట జనాలకు పెద్దగా తెలిసిన పేరు కాదు. బడంగి పేట అని గూగుల్ సెర్చ్ చేయండి. వచ్చేవార్తలన్నీ లైబ్రరీ ని సూచించేవి కాదు. రాజకీయవార్తలు,భూకబ్జా వార్తలు, అవినీతి వార్తలు ఉంటాయి. చదువు, సంస్కృతి వార్తలు కనిపించవు. అంటే ఒక మంచి లైబ్రరీ ఉందనే సూచన ఇచ్చే వార్తలు కానేకావు. ఇలాంటి చోటుని జిల్లా గ్రంధాలయానికి ఎంపిక కావడం నాకు భలే నచ్చింది.
మళ్లీ చెబుతున్నాను, మా కాలనీలో మాయింటికి దగ్గిరలో జిల్లా గ్రంథాలయం ఏర్పాటయింది.
లైబ్రరీలు పుస్తకాలను లేదా వాటి సాఫ్ట్ మెటీరియల్‌లను అందిస్తాయి. గ్రంథాలయాలు అంటే మనకు భౌతిక గ్రంథాలయాలే గుర్తొస్తాయి. ఇపుడు వర్చువల్ లైబ్రరీలు వస్తున్నాయి. ఇవి ఇంటర్ నెట్ లో ఉంటాయి. మా కాలనీ లైబ్రరీ భౌతిక పుస్తకాలనే కాదు, డిజిటల్ మెటీరియల్ ని భద్రపరిచే అతి పెద్ద గ్రంథాలయం ఇది.
లైబ్రరీల ప్రాముఖ్యం తగ్గిపోతున్నపుడు,చాలా లైబ్రరీలు వెలవెలపోతున్నాయి. సందర్శకులుగాని,పుస్తకాలు అరువుతీసుకునే వారు కరువై పోతున్నారు. అలాంటి ఈ రోజుల్లో ఒక ఆధునిక గ్రంథాలయం మా ఏరియా లోనే రావడం నలుగురితో పంచుకోవలసి ఆనందం. సందర్శకులకు అనువయిన వాతావరణం కల్పించేందుకు ఈ లైబ్రరీలో కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.అదీ కూడా నాకు బాగా నచ్చింది. అవేవంటే...
లైబ్రరీలోని ఏ ప్రాంతంలోనైనా శబ్దం, అంతరాయం లేదా వికృత ప్రవర్తన, నిషేధించారు
లైబ్రరీలో ధూమపానం, ఆహారం, పానీయాలు నిషేధం.
లైబ్రరీలో నిశ్శబ్దం తప్పనిసరిగా పాటించాలి.
ఇది లైబ్రరీ ని ఏర్పాటుచేసేందుకు దారితీసిన చారిత్రక అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. భౌతిక, ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, హైబ్రిడ్ లైబ్రరీల వంటి విభిన్న లైబ్రరీ నమూనాలను ఎందుకు అనుసరించడం వెనక కూడా గొప్ప ఉద్దేశం ఉంది.
ఇది నిజానికి మా ఇంటి దగ్గరే ఉంది. నేను ఎప్పుడు వెళ్దాము అనుకుంటాను కానీ కుదరలేదు ...ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అని తలిచి ఒక ఆదివారం వెళ్లాను ...నాకు అందులోకి వెళ్ళగానే మరో ప్రపంచం లో కి అడుగు పెట్టినట్టు ఉంది. ఆశ్చర్యం అద్భుతం అని చెప్పొచ్చు.ఎన్నైనా చెప్పండి, పుస్తక ప్రపచంలోకి, అది పుస్తకాల షాపైనా, అబిడ్స్ వోల్డ్ పుస్తకాల ఫుట్ పాతైనా,లైబ్రరీ, అయినా బుక్ ఎగ్జిబిషనయినా నాకు ఒకేరకం అనుభూతి కలుగుతుంది.
మా పొరుగు లైబ్రరీలో ప్రతీ రోజు వచ్చే వార్తాపత్రికలకి ఒక విభాగం, పుస్తకాల భద్రపరచడానికి మరొక విభాగం, ఇంకా పోటీ పరీక్షల సంసిద్ధత కొరకు మరొక విభాగం.
అలాగే పరిశోధక విద్యార్ధుల కి ఉపయోగ పడేలా పుస్తకాల ప్రదేశం వేరు. సాధారణం గా ఈ గ్రంధాయలం చూసాక మెయిన్ గా ఉన్న చిక్కడపల్లి లో గాని, అఫ్జల్గంజ్ లో ఉన్న పెద్ద గ్రంధాలయం కి వెళ్లాల్సిన అవసరం లేదు అనిపించింది. అయితే వాటి తో పోలిస్తే కొంచెం తక్కువ అయినా కూడా ...చాలావరకు పుస్తకాలు గాని ప్రపంచం లో వచ్చే ప్రతి వార్త పత్రిక గాని ఇక్కడ ఉన్నాయి అని చెప్పొచ్చు.
ఈ గ్రంధాలయం 2022 లో అప్పటి విద్యశాఖ మంత్రి గారు అయినా సబితా ఇంద్రా రెడ్డి గారు ఆవిష్కరించారు. వారి కృషి తో నే ఈ అద్భుతమైన పుస్తకాలయానికి పునాది పడింది. ఈ ప్రాంతంలో ఒక లైబ్రరీ అవసరమనే గుర్తింపు రావడమే గొప్ప. ఈ విషయంలో ఆమెను అభినందించాలి.
మెయిన్ సిటీకి దూరంగా ఉన్న పల్లెటూరి లాంటి కాలనీల్లో విద్యార్థులు విద్యా రంగంలో , మరీ ముఖ్యం గా పోటీ పరీక్షలో వెనక బడవద్దు అనే గొప్ప సంకల్పం తో ఈ లేబ్రరీని ఏర్పాటు చేసారు. దీని ప్రధాన ఉద్దేశ్హ్యం గ్రామీణ విద్యార్థులు పట్టుదల తో చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునేందుకు అనువయిన వాతావరణ కల్పించడం.మంచి లైబ్రరీ, అవసమయిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉంటూ, పుస్తకపఠనాన్ని ప్రోత్సహించే వాతావరణ కలిపిస్తే తప్పకుండా లైబ్రరీకి ఆదరణ ఉంటుంది.
ఇది ఏర్పాటు కాక మునుపు ఈ ప్రాంతంలో పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న యువతీ యువకులు చంపా పేట లైబ్రరీ లేదా అశోక్ నగర్ లో ఉన్న సెంట్రల్ లైబ్రరీ కి వెళ్లేవారు, అవి కాస్త దూరం. అక్కడికి వెళ్లడం వ్యయప్రయాస కూడా. ఈ లైబ్రరీ కి ఏర్పాటు చేసాక అక్కడికి వెళ్లే బాధ తప్పింది , వారు ప్రిపేరేషన్ కు మరింత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు
ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటి అంటే ...మహిళలు, స్త్రీల కోసం ప్రత్యేక గది ని కేటాయించడం. సాధారణం గా పాఠకుల లో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు ..ఎక్కడైనా కూడా ఇద్దరికి కలిపే పెద్ద హాల్ ఉంటుంది . కానీ ఇక్కడ మాత్రం పురుషులకి, మహిళా పాఠకులకి విడి విడి గా ఉండటం గొప్ప విశేషం అని చెప్పొచ్చు. ప్రతేకం గా మహిళా విద్యార్థుల కి ఎంతో ఉపయుక్తం అని చెప్పొచ్చు. ఈ మహిళా విభాగానికి అందరు మహిళా ఉద్యోగులే నిర్వహించడం విశేషం.
"నేను ప్రతీ రోజు ఇక్కడికి వస్తాను. నా ఉద్యోగ సంబందించిన సమాచారాన్ని ఇక్కడ నుంచి సేకరించి దానిని ఉపయోగించుతాను" అని స్టెనోగ్రాఫేర్ సంతోష్ చెప్పారు. అలాగే వైద్య విద్య అభ్యసిస్తున్న ఆనంద్ ప్రతీ దినము ఇక్కడికి వచ్చి వైద్య విద్య లో కఠినమైన అంశాలని లోతుగా శోధించి తెలుసుంటాడు.
ఇక్కడి సంచాలకులు చెప్పారు, ఇక్కడికి ప్రతీ రోజు రెండు వందల నుంచి మూడు వందల మంది గ్రామీణ విద్యార్థులు వచ్చి పోటీ పరీక్షలకి శిక్షణ పొందుతారు అట. ఆదివారం కూడా తెరిచి ఉంచుతారు ..ప్రతీ దినం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంచుతారు . ఆదివారం రోజున పుస్తక విభాగం మాత్రం మూసి వేస్తారు .మిగతా విభాగాలు అన్నీ తెరిచి ఉంచుతారు. ఈ లైబ్రరీ లో ప్రపంచ ప్రఖ్యాత చెందిన న్యూస్ పేపర్, వార్త పత్రికలూ, నెల , మాస పత్రికలూ , త్రైమాసిక , వార్షిక పత్రికలూ కూడా రావడం విశేషం.
ఈ గ్రంధాలయం అన్ని రోజులలో తెరిచి ఉంచబడుతుంది ఒక్క పబ్లిక్ హాలిడేస్ లో మాత్రం సెలవు ఉంటుంది. ఇక్కడ గవెర్నమెంట్ వాళ్ళు నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సరి అయినా మెటీరియల్, ఇంకా వాటికి సంబందించిన శిక్షణ అంతా కూడా ఉచితం గా ఇవ్వబడుతుంది.
ఏదైనా కాంపిటీటివ్ ఎక్సమ్ కి బయట కోచింగ్ తీసుకోవాలి అంటే పేద విద్యార్ధులకి అయ్యే పని కాదు ..అందులో గ్రామీణ నేపథ్యం కలిగిన వారికి కష్టం . అందుకే వారిని ద్రుష్టి లో పెట్టుకొని ఇక్కడ పోటీ పరీక్షల శిక్షణ కూడా ఉచితం గా ఇస్తున్నారు గొప్ప విషయము కదా...
ఇక సువిశాల మైనా బిల్డింగ్ లో దేని దానికి ప్రత్యేక రూము లు, మరియు ప్రత్యేక డెస్క్ లు కలిగి ఉన్నాయి. ప్రశాంత మైన వాతావరణం లో విద్యార్థులు అంతే ప్రశాంతం గా చదువుకుంటున్నారు. ఇక్కడ నేను గమించింది ఏమిటి అంటే కేవలం విద్యార్థులే కాదు చాలామంది విశ్రాంతి ఉద్యోగులు, ఇంకా చదువు పట్ల ఆసక్తి కలిగిన పాఠకులని ఎందరినో చూసాను. ఇంకొక సౌలభ్యం ఏమిటి అంటే ...కొన్ని రకాల సాంకేతిక విద్య లో పుస్తకాలు చాలా ఖరీదు అయినవి ఉంటాయి అవి పేద విద్యార్థులు కొనడం కష్టం. అలాంటివి కూడా ఇక్కడ ఉచితం గా చదువుకోవచ్చు.
ఈ లైబ్రరీ కి ఉన్న మరో అదనపు సౌకర్యం Digitalization అతి పురాతనమైన గ్రంధాలూ అన్నీ కూడా డిజిటల్ రూపం లో భద్రపరుస్తున్నారు. ఇక్కడ కూడా ఆ సౌకర్యం లభిస్తుంది. నేను ఇక్కడ సుమారు రెండు గంటలు గడిపాను ...నాకు అస్సలు సమయం సరిపోలేదు అంటే నమ్మండి. నాకు మాములు గా నే పుస్తక పఠనం అంటే పిచ్చి. అలాంటిది అన్ని పుస్తకాలు . పేపర్ లు ఒకే చోట దొరికితే ఎలా వదులుతాను ...అందుకే నాకు కుదిరినంత మేర చదివి ఆస్వాదించాను.
ఈ సారి మీరు కానీ ఇటు వైపు గా వస్తే ఒకసారి ఈ గ్రంధాలయాన్ని దర్శించండి బాగుంటది ...ఎంతైనా పాఠకులు అదృష్టం చేసుకున్నారు . ఇలాంటి మారు మూల ప్రాంతం లో గొప్ప గ్రంధాలయం ఉంది సంతోషం. ...