మీరేమీ "గొంతెమ్మ కోరికలు" కోరడం లేదు కదా!
మనం రకరకాల సామెతలు లేదా జాతీయాలను వాడుతుంటాం. అవి ఎలా పుట్టాయో తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది.
By : Admin
Update: 2024-05-22 02:28 GMT
మనం రకరకాల సామెతలు లేదా జాతీయాలను వాడుతుంటాం. నిజానికి వాటిలో చాలా వాటికి అర్థం తెలియకుండానో వాడేస్తుంటాం. అవి ఎలా పుట్టాయో తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అటువంటి వాటిలో ఒకటి ఈ గొంతెమ్మ కోరిక. ఈ సామెత పుట్టుక చాలా తమాషాగానూ ఉంటుంది.
శ్రీకృష్ణా యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్ర వంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణగోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
పోతన భాగవతంలో కుంతి శ్రీకృష్ణుణ్ణి ప్రార్ధిస్తూ చెప్పిన ప్రసిద్ధమైన పద్యం.
మన గొంతెమ్మ కోరికకీ ఈ పద్యానికీ ఏమిటి సంబంధం. అక్కడికే వెళదస్మ్!
కుంతీదేవి కోరిక: కర్ణుడు పాండవులపక్షం వచ్చేట్లు చూడమని కృష్ణుణ్ణి కోరుకుంది. చాలా ట్రై చేసాను. నావల్లకాలేదని చేతులెత్తేసాడు.
ఇది తీరని కోరిక. ఈ కుంతి కోరిక.. రానురాను.. కుంతెమ్మ కోరికగా, 'గొంతెమ్మ కోరికగా స్థిరపడింది. తీరే అవకాశం లేని కోరికలను 'గొంతెమ్మ కోరిక 'గా వాడుకలోకి వచ్చింది.
దీనికి మరో కథ కూడా ఉంది..
కురుక్షేత్ర యుద్ధ సమయాన కర్ణుడితో కుంతీదేవి "కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి" అని కోరుకున్నది, కానీ అది అసంభవం, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెబుతాడు. ఏదో విధంగా చూడలేవా కృష్ణా అని ఆమె ప్రాదేయపడుతుంది. కుదరమ్మా అంటాడు కృష్ణుడు. అందువల్ల సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. "అవ్వా కావాలి , బువ్వా కావాలి " అన్న జాతీయం కూడా ఈ కోవకు చెందినదే.
ఉంటే ఉగాది - లేకుంటే శివరాత్రి !అని మరో సామెత ఉంది. దానర్థం ఏమిటంటే..
లేకపోవడం : పేదరికం
ఉన్నది చాలకపోవడం : దరిద్రం (దారిద్ర్యం - సంస్కృత పదం)
పేదరికం - తిట్టు మాట కాదు గాని అలా స్థిరపడిపోయింది.
దరిద్రం - తిట్టు పదం గా స్థిరపడింది.
దరిద్రమ్మొహం, దరిద్రపుసినిమా, ఇత్యాది.
సేకరణ. జి.రమేశ్ చంద్రబాబు