జార్ఖండ్‌లో ఎవరి బలం ఎంత? ఎక్జిట్ పోల్స్‌పై భిన్నాభిప్రాయాలు

ఎక్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఫెడరల్ సీనియర్ ఎడిటర్ పునీత్ నికోలస్ యాదవ్ రాజకీయ విశ్వేషకులతో డిబేట్‌ నిర్వహించారు.

Update: 2024-11-21 11:30 GMT

జార్ఖండ్ రెండో విడత ఎన్నికలు ఈ నెల 20న జరిగాయి. మొదటి విడత 13వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఎక్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఫెడరల్ సీనియర్ ఎడిటర్ పునీత్ నికోలస్ యాదవ్ రాజకీయ విశ్వేషకులతో డిబేట్‌ నిర్వహించారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలో జేఎంఎం ఆదివాసీ హక్కులు, స్థానిక సమస్యలు, బీజేపీ పాలనపై వ్యతిరేకతను తమ ప్రధాన బలంగా మార్చుకుంది.

జార్ఖండ్‌లో ప్రధాన అంశాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ఆదివాసీ హక్కులు, భూ సేకరణ విధానాలు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఆదివాసీ సంక్షేమ పథకాలు, ఎన్ఆర్సీ-సీఏఏ‌పై దృష్టి పెట్టిన సమయంలో జేఎంఎం వాటిని వ్యతిరేకించి గట్టిగా నిలబడింది. జేఎంఎం నాయకుడు చంపాయి సోరెన్ బీజేపీ అభ్యర్థిగా మారటం ఆంతరంగిక రాజకీయాలు ఫలితాలను ప్రభావితం చేసి ఉండవచ్చు.

‘‘బీజేపీ వ్యూహం ఆదివాసీ మద్దతుపై ఆధారపడగా..జేఎంఎం స్థానికత, స్వావలంబన‌పై మరింతగా దృష్టి పెట్టింది. ఆదివాసీ ఓట్లలో స్వల్ప మార్పు కూడా ముఖ్యమైన మార్పు తీసుకురాగలదు’’ అని జార్ఖండ్ స్టేట్ న్యూస్ ఎడిటర్ మనోజ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన ఫలితాల కోసం వేచిచూడాల్సి ఉంది. స్వతంత్రులు, చిన్నపార్టీలు రెండు రాష్ట్రాల్లో కింగ్‌మేకర్లుగా మారవచ్చని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఎన్నికలు నవంబర్ 20న జరిగాయి. 23న ఫలితాలు వెలువడతాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలివి..

పీపుల్స్ పల్స్: బీజేపీ (44–53), జేఎంఎం-కాంగ్రెస్ (25–37)

రిపబ్లిక్ పి-మార్క్: బీజేపీ (31–40), జేఎంఎం-కాంగ్రెస్ (37–47)

పోల్ ఆఫ్ పోల్స్: బీజేపీ (42), జేఎంఎం-కాంగ్రెస్ (37)

Tags:    

Similar News