‘హర్యానా ఫలితాలపై ఫిర్యాదులను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం.’

హర్యానాలో మొత్తం 90 స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌కు కేవలం 37 స్థానాలు మాత్రమే దక్కాయి.

Update: 2024-10-09 08:30 GMT

హర్యానాలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. పార్టీ ఓటమి పాలైంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సారి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. చివరకు కాషాయ పార్టీకే జనం జై కొట్టడంతో హ్యట్రిక్ ఆ పార్టీ సొంతమైంది. అయితే ఫలితాలకు సంబంధించి పలు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఓటర్లకు ధన్యవాదాలు..

ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా జమ్ము కాశ్మీర్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. “జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్రంలో కూటమి సాధించిన విజయం రాజ్యాంగ విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం. హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం. పలు నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. మద్దతు ఇచ్చిన హర్యానా వాసులకు, అవిశ్రాంతంగా కృషి చేసిన మా బబ్బర్ షేర్ కార్మికులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ హక్కుల కోసం, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం.” అని ఎక్స్‌లో పోస్టు రాశారు.

కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలెన్ని?

జమ్మూ కాశ్మీర్‌లోని 90 సీట్లలో ఎన్‌సి 42 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ ఆరింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీకి29 సీట్లు దక్కాయి. ఇక హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో 48 సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌కు కేవలం 37 సీట్లు మాత్రమే వచ్చాయి.

కాంగ్రెస్ కార్యాలయానికి జిలేజీ పార్సల్..

రాహుల్ హర్యానా ఎన్నికల ప్రచారంలో మోదీ పాలనలో మిఠాయి విక్రేతలు ఎలా నష్టపోతున్నారో నొక్కిచెప్పడానికి ప్రఖ్యాత జిలేబీ తయారీదారు 'మతు రామ్ హల్వా' బాక్స్‌ను ప్రదర్శించారు. ఫలితాలు వెలువడ్డాక, ఇప్పుడు ఏమంటావు రాహుల్.. అంటూ బీజేపీ నాయకులు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి జిలేబీని పార్సల్ చేసి పంపారు.

‘కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా టైం లేదు’

BJP IT చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ వేదికగా రాహుల్‌ను విమర్శించారు. ఫలితాలు వెలువడిన తర్వాత హర్యానాలో ఓటమి తర్వాత ఓటర్లకు, తమ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడానికి రాహుల్ గాంధీకి సమయం దొరకలేదు. కాశ్మీర్‌లో ఎన్‌సి నాయకత్వ పనితీరును ప్రశంసించేందుకు నోరు రాలేదు అని కామెంట్ చేశారు.

Tags:    

Similar News