కర్ణాటకలో టెస్లా?

దేశం మొత్తం అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

Update: 2024-06-12 12:45 GMT

దేశం మొత్తం అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీ కర్ణాటకలో ఫ్యాక్టరీ పెట్టడానికి ఆసక్తి చూపుతుందా? అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు కుమారస్వామి స్పందించారు.

‘‘టెస్లా వంటి కంపెనీని కర్ణాటకకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ కంపెనీ రావడం వల్ల అభివృద్ధి కర్ణాటకకు మాత్రమే పరిమితం కాదు. దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నా. నేను స్వార్థపరుడిని కాదు. దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేస్తా’’ అని సమాధానమిచ్చారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మోదీకి అభినందనలు తెలిపారు. తన కంపెనీలు ఇండియాలో పని చేయాలని ఎదురుచూస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా మస్క్ పేర్కొన్నారు.

Tags:    

Similar News