‘మాది రామలక్షణ బంధం..వేరు చేయడం ఎవరి వల్లకాదు’

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో తనకున్న సంబంధాన్ని రామలక్షణ్ అనుబంధంగా వ్యవహరించారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా. తమను ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు.

Update: 2024-09-23 07:14 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో తనకున్న సంబంధాన్ని రామలక్షణ్ అనుబంధంగా వ్యవహరించారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా. తమను ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు.

సిసోడియా "డ్రామా రాజు" అని, రానున్న ఎన్నికలలో తనను తాను లక్ష్మణ్‌గా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.

కేజ్రీవాల్ నుంచి బిజెపి తనను వేరు చేయాలని చూస్తోందని, రాముడి నుండి లక్ష్మణుడిని వేరు చేసే శక్తి రావణుడికి (బీజేపీ) లేదు" అని సిసోడియా వ్యాఖ్యానించారు. "నియంతృత్వ రావణుడిపై రాముడిగా అరవింద్ కేజ్రీవాల్ ఈ యుద్ధం చేస్తున్నంత కాలం, తాను లక్ష్మణుడిగా ఆయన వెంటే ఉన్నానన్నారు.

ప్రజలు తనకు తిరిగి నిజాయితీపరుడని సర్టిఫికేట్ ఇస్తే తప్ప, ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం లేదా విద్యాశాఖ మంత్రి పదవిని చేపట్టనని సిసోడియా తేల్చిచెప్పారు.

కేజ్రీవాల్ ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ప్రజల నుంచి నిజాయితీ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే తాను మళ్లీ పదవిని నిర్వహిస్తానని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సిసోడియా కాషాయ పార్టీపై విరుచుకుపడుతూ.. 'నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు 2002లో రూ. 5 లక్షలకు చిన్న ఇల్లు కొన్నానని, నా బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు ఉన్నాయని, ED నా బ్యాంక్ ఖాతాను సీజ్ చేసింది. నా కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడానికి ఇతరుల సాయం కోరాల్సి వచ్చింది." అని గుర్తుచేసుకుంటూ.. ఎక్సైజ్ పాలసీ కేసులో తాను జైలుకు వెళ్లిన తర్వాత బీజేపీలో చేరేందుకు తనను మభ్యపెట్టారని ఆరోపించారు. అయితే ఢిల్లీ బీజేపీ చీఫ్ ఈ ఆరోపణను ఖండించారు. ఆయన ఆరోపణలు హస్యాస్పదమని కొట్టిపడేశారు. జైలు నుంచి విడుదలైన ఒకటిన్నర నెలల తర్వాత, కథను చెప్పడం ఆశ్చర్యంగా ఉంది" అని సచ్‌దేవా కౌంటర్ ఇచ్చారు. 

Tags:    

Similar News