అమిత్ షాతో భేటీ కానున్న షిండే, ఫడ్నవీస్, అజిత్

మొత్తం 288 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు మరాఠా సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అందుకే బీజేపీ నాయకత్వం సీఎం పేరు ప్రకటించడంలో జాప్యం చేస్తుందా?

Update: 2024-11-28 12:41 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం ఎంపిక విషయాన్ని బీజేపీ అధిష్టానానికే వదిలేశానని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి గురువారం రాత్రి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో ‌ఢిల్లీలో సమావేశం కానున్నారు. వారితో చర్చించి ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.

అన్ని పార్టీలకు చెందిన 288 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు మరాఠా సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఆ కారణంగానే బీజేపీ నాయకత్వం కొంతమంది మరాఠా నేతల పేర్లను పరిశీలిస్తోందన్న వార్తల వస్తున్నాయి. అయితే ఫడ్నవీస్‌ మూడోసారి సీఎం కావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉన్నారు.

కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని షిండే కోరుకోవడం లేదని ఆయన సన్నిహితుడు చెప్పారు. అయితే క్యాబినెట్‌లో భాగమవుతారని ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ తెలిపారు. శిర్సత్ మాటలకు బట్టి షిండే నేతృత్వంలోని శివసేన మరో నేతను డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది.

అయితే బ్రాహ్మణు సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవీస్ 2014లో సీఎం అయ్యారు. 2019లో మళ్లీ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.

నాన్నను చూపి గర్వపడుతున్నా...

‘‘ మహారాష్ట్ర ప్రజలతో మా నాన్నకు లోతైన అనుబంధం ఉంది. వ్యక్తిగత ఆశయం కంటే సమిష్టి పాలనకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఆయన దగ్గరయ్యారు. నాన్నను చూసి ఎంతో గర్వపడుతున్నా. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై విశ్వాసం ఉంచి సీఎం ఎంపిక వారికే వదిలేశారు. మిత్ర ధర్మానికి నాన్న ఒక్క చక్కని ఉదాహరణ’’ అని అన్నారు.

ఎవరికి ఎన్ని ఓట్లు..

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 మంది సభ్యుల సభలో 230 సీట్లను గెలుచుకోవడం ద్వారా బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి కోలుకున్న బీజేపీ 132 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. సేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.

కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16 సీట్లు మాత్రమే గెలుచుకుంది. శరద్ పవార్ ఎన్సీపీ(ఎస్పీ) కేవలం 10 సీట్లు గెలుచుకోగా, ఉద్ధవ్ ఠాక్రే (యూబీటీ) 20 సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగ్గా, నవంబర్ 23న ఫలితాలు వెలువడ్డాయి.

మంగళవారం ఏకనాథ్ షిండే తన సీఎం పదవికి రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా షిండేను కొనసాగించాలని గవర్నర్ అభ్యర్థించారు.  

Tags:    

Similar News