‘మహారాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు’

మహారాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అది కనిపిస్తుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Update: 2024-10-13 14:32 GMT

మహారాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోసం కోరుకుంటున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అది కనిపిస్తుందని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ముంబైలో మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నియోజకవర్గాల నాయకులతో కలిసి మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో MVA లోక్‌సభ ఎన్నికల పనితీరును పునరావృతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రస్తుత ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుకుంటున్నాం. వారు మాకు మద్దతు ఇస్తారని నమ్మకం ఉంది" అని పవార్ పేర్కొన్నారు.

మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్ ఉన్నారు.

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల ఓట్ల శాతంలో కేవలం 0.6 శాతం మాత్రమే తేడా ఉందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గుర్తుచేశారు. జమ్ము కాశ్వీర్ పార్టీ పుంజుకోకపోవడం గురించి మాట్లాడుతూ.. "జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఎందుకు చర్చించలేదు? ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పార్టీ (బిజెపి) ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి ఉండాల్సింది" అని అన్నారు.

మోదీ మర్చిపోయారనుకుంటా..

బంజారా వర్గానికి కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఇటీవల మహారాష్ట్రలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందించారు. ఆ సామాజికవర్గానికి చెందిన వసంతరావు నాయక్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయాన్ని మోదీ మర్చిపోయారని చురకలంటించారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రధాని రాజకీయ ప్రసంగాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు.

ఒకప్పుడు మహారాష్ట్రలో పరిపాలన దేశంలోనే అత్యుత్తమంగా ఉండేదని ఇప్పుడు ఇటీవల మహాయుతి కూటమి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అపహాస్యం పాలవుతుందన్నారు. ఈ ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తం చేసేందుకు సమిష్టి ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలు మద్దతిస్తారని ఆశిస్తున్నామన్నారు.

ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్ హత్య కేసులో అరెస్టులు, బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్షయ్ షిండేను కాల్చి చంపడం.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని థాకరే అన్నారు.

ముంబైలో "ఇద్దరు పోలీసు కమీషనర్లు" ఉన్నా.. నగరంలో నేరాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష కూటమి vs మహాయుతి కూటమి

వచ్చే నెలలో జరిగే ఎన్నికలు ప్రతిపక్ష కూటమి, అధికార మహాయుతికి మధ్య గట్టి పోటీ ఉంటుందని పటోలే చెప్పారు. మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించిన వెంటనే తామూ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వాన్ని ఓడించడమే తమ ధ్యేయంమని స్పష్టం చేశారు.

Tags:    

Similar News