మహారాష్ట్రలో ఎన్‌సీపీ (ఎస్‌పీ) సెకండ్ లిస్ట్ రిలీజ్..

మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు మొత్తం 288. ఇప్పటివరకు ఎన్సీపీ (ఎస్పీ) 67 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Update: 2024-10-27 09:06 GMT

Maharashtra NCP (SP) president Jayant Patil

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) (ఎస్‌పీ) (శరత్ పవార్) తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. 22 మంది పేర్లను శనివారం ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఎన్సీపీ (ఎస్పీ) 67 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.

మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు మొత్తం 288. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సీపీ (ఎస్‌పీ), శివసేన (యుబీటీ) ఎన్నికల్లో ఒక్కొక్కరు 85 స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో చెప్పారు. మిగిలిన సీట్లపై ఇతర పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని మహారాష్ట్ర ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు. ఎన్ని స్థానాల్లో ఎంత మందిని నిలిబెట్టాం అన్నది ముఖ్యం కాదని, గెలిచే అభ్యర్థిని నిలబెట్టడమే ప్రధానమని చెప్పారు.

సెకండ్ లిస్టులోని అభ్యర్థుల పేర్లు..

1. ఎరండోల్ - సతీష్ అన్నా పాటిల్

2. గంగాపూర్ - సతీష్ చవాన్

3. షాపూర్ - పాండురంగ్ బరోరా

4. పరండా - రాహుల్ మోతే

5. బీడు - సందీప్ క్షీరసాగర్

6. అర్వి - మయూర కాలే

7. బగ్లాన్ - దీపికా చవాన్

8. యోలా - మాణిక్రావ్ షిండే

9 పాప - ఉదయ్ సాంగ్లే

10. దిండోరి - సునీతా చరోస్కర్

11. నాసిక్ ఈస్ట్ - గణేష్ గీతే

12. ఉల్హాస్‌నగర్ - ఓమి కలానీ

13. జున్నార్ - సత్యశీల షెర్కర్

14. పింప్రి సులక్షణ - షిల్వంత్

15. ఖడక్వాస్లా - సచిన్ డోడ్కే

16. పార్వతి - అశ్వినీతై కదం

17. అకోలే - అమిత్ భాంగ్రే

18. అహల్య నగర్ సిటీ - అభిషేక్ కలంకర్

19. మల్షీరాస్ - ఉత్తమ్రావ్ జంకర్

20. ఫాల్టాన్ - దీపక్ చవాన్

21. చంద్‌గడ్ నందినితై – భబుల్కర్ కుపేకర్

22. ఇచల్‌కరంజి - మదన్ కరాండే

Tags:    

Similar News