మహారాష్ట్రలో MVA 85:85:85 ఫార్ములా..

మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. MVA కూటమి భాగస్వాములు 85-85-85 ఫార్ములాకు అంగీకరించారు. అంటే ఒక్కో భాగస్వామి 85 సీట్లు పంచుకున్నారు.

Update: 2024-10-24 07:03 GMT

మహారాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇటు సీట్ల సర్దుబాటుపై చర్చలు ఊపందుకున్నాయి. మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ( కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన (UBT), శరద్ పవార్ NCP (SP) నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తం సీట్లు 288. కాగా కూటమి భాగస్వాములు 85-85-85 ఫార్ములాకు అంగీకరించారు. అంటే ఒక్కో భాగస్వామి 85 సీట్లు పంచుకున్నారు. 

మరో 18 సీట్లను కాంగ్రెస్, సేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) పక్కన పెట్టాయి. వీటికి అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, రైతులు, కార్మికుల పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన 15 అసెంబ్లీ స్థానాలను పంచుకోవడంలో కాంగ్రెస్, ఉద్ధవ్ పార్టీలు మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

రేపటికి తుది నిర్ణయం..

రేపటికి సీట్ల పంపకాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని శివసేన (యుబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. రౌత్, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర యూనిట్ చీఫ్ జయంత్ పాటిల్, కాంగ్రెస్ ఉద్ధవ్ సేన ఈ 15 నియోజకవర్గాలను ఎలా పంచుకోవాలనే దానిపై తర్జన, భర్జన పడుతున్నాయి.

'పవార్‌ వ్యూహాత్మక చర్చలు'

సీట్ల సర్దుబాటులో పెద్దన్నగా శివసేన(UBT), కాంగ్రెస్‌ల మధ్యవర్తిగా శరద్ పవార్‌ వ్యవహరించినట్లు సమాచారం. ఆయన సూచనమేరకే 85 ఫార్ములాకు అంగీకరించారని తెలుస్తోంది.

ఎస్పీకి 5 సీట్లు?

చిన్న మిత్రపక్షాలకు కేటాయించిన 18 నియోజకవర్గాల్లో సమాజ్‌వాదీ పార్టీ ఎనిమిది సీట్ల డిమాండ్‌ చేస్తుండగా.. వాటిలో కనీసం 5స్థానాలు కేటాయించే అవకాశం ఉందని MVA వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన సేన..

MVA దాని ప్రాథమిక సీట్ల భాగస్వామ్య సూత్రాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే, శివసేన (UBT) 65 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరే ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇక కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) విడివిడిగా దాదాపు 70 మంది అభ్యర్థులను ఖరారు చేశాయి. వారి పేర్లను గురువారం సాయంత్రానికి విడుదల చేసే అవకాశం ఉంది. సీట్ల భాగస్వామ్యం పూర్తయిక ప్రతి ప్రాంతంలోనూ ఉమ్మడిగా MVA ర్యాలీలు నిర్వహించడంపై చర్చలుంటాయని తెలుస్తోంది. 

Tags:    

Similar News