రాజీనామాను సమర్పించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ సమావేశానికి ముందు ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.
Update: 2024-06-05 10:54 GMT
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 5) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ సమావేశానికి ముందు ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ రద్దు చేయాలని కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసినట్లు సమాచారం.
మంగళవారం జరిగిన ఎలక్షన్ కౌంటింగ్‌లో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మెజారిటీ స్థానాలు సాధించింది. 543 సభ్యుల లోక్‌సభలో NDA మెజారిటీ మార్కు 272 దాటింది. ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 263 స్థానాలు దక్కాయి. కేవలం BJP 240 సీట్లు గెలుచుకుంది. ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో మరోసారి ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా మిత్రపక్షాలు ఎన్నుకోబోతున్నాయి.