Maharashtra Politics | ‘‘మహాయుతి’’ మైత్రి కొనసాగుతుందా?

మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సారి వీరి బంధం ఐదేళ్ల పాటు కొనసాగుతుందా? లేదా? అన్నది అనుమానాస్పదంగా ఉంది.;

Update: 2024-12-06 11:03 GMT

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చినా.. భవిష్యత్తులో ఈ మైత్రి అంతబలంగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నీలూ వ్యాస్ హోస్ట్‌గా వ్యవహరించే ‘ది ఫెడరల్ క్యాపిటల్ బీట్’ యూట్యూబ్ డిబేట్‌లో పొలిటికల్ అనలిస్ట్ పుష్పరాజ్ దేశ్‌పాండే, సీనియర్ జర్నలిస్టులు గిరీష్ జోషి, వివేక్ దేశ్‌పాండే తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఫడ్నవీస్ ఈ స్థాయిలో ఎదగడం ఢిల్లీ బీజేపీ నాయకత్వంతో సంబంధాల్లో సమస్యలకు దారితీస్తుందా? అనే విషయంపై చర్చించారు. కొందరు ఫడ్నవీస్‌ను భవిష్యత్తు ప్రధాని అభ్యర్థిగా సిద్ధం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

మైత్రి బలంగా ఉంటుందా?

‘‘ఏక్‌నాథ్ షిండే తొలుత ఉపముఖ్యమంత్రి పదవి పట్ల ఆసక్తి చూపలేదు. హోం శాఖ కోసం పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వారి బంధం ఎంతవరకు బలంగా ఉంటుందన్నది వేచిచూడాలి. బీజేపీకి షిండే అవసరం 2025లో జరగబోయే మునిసిపల్ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత షిండేను పక్కన పెడతారు" అని పుష్పరాజ్ దేశ్‌పాండే పేర్కొన్నారు.

అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. భవిష్యత్తులో షిండే అవసరాన్ని అజిత్ పవార్ తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురి మైత్రి దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అనేది సందేహాస్పదమే. మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారుతుంటాయి." అని గిరీష్ జోషి, వివేక్ దేశ్‌పాండే అన్నారు.

Full View

Tags:    

Similar News