Maharashtra Elections: ఓటర్లను కొనేశారు: సంజయ్ రౌత్

"ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఎమ్మెల్యేలంతా ఎలా గెలవగలరు? మహారాష్ట్రకు ద్రోహం చేసిన అజిత్ పవార్ ఎలా గెలుస్తారు?" అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

Update: 2024-11-23 07:43 GMT

మహారాష్ర్టలో అధికార మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విపక్ష కూటమి అభ్యర్థులు చతికిలపడ్డారు. తొలిరౌండ్ ఫలితాల్లోనూ చాలాచోట్ల మహాయుతి కూటమి అభ్యర్థులు దూసుకుపోతుండడంతో మహా వికాస్ అఘాడీ అభ్యర్థులకు అనుమానం మొదలైంది. ఎక్కడో ఏదో జరిగిందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 'పెద్ద కుట్ర' జరిగిందని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ శనివారం ఆరోపించారు. విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంది. అధికార కూటమి విధానాలపై జనం కోపంగానే ఉన్నారు. కాని కౌంటింగ్‌లో మహాయుతి కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఓటర్లకు డబ్బులిచ్చారన్నడంలో ఎలాంటి సందేహం లేదు.’’ అని పేర్కొన్నారు.

"ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఎమ్మెల్యేలంతా ఎలా గెలవగలరు? మహారాష్ట్రకు ద్రోహం చేసిన అజిత్ పవార్ ఎలా గెలుస్తారు?" అని రాజ్యసభ ఎంపీ ప్రశ్నించారు.

ఆధిక్యంలో మహాయుతి కూటమి..

అధికార BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 204 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) అభ్యర్థులు కేవలం 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

అధికార మహాయుతి కూటమిలో బీజేపీ 149 అసెంబ్లీ స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.

ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 మంది అభ్యర్థులను, శివసేన (యూబీటీ) 95 మంది, ఎన్సీపీ (ఎస్పీ) 86 మంది అభ్యర్థులను నిలబెట్టాయి.  

Tags:    

Similar News