మధ్యాహ్నం 1 గంటకు 40% పోలింగ్
చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్‌లోని 4, యూపీలో 13, బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్‌లోని 4, యూపీలో 13, బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఏడో, చివరి దశ పోలింగ్‌లో శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితో సహా ఏడు రాష్ట్రాలు, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతమైన 57 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు.
చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి.
EC అధికారిక సమాచారం ప్రకారం..మధ్యాహ్నం 1 గంటల వరకు సుమారుగా 40.09 పోలింగ్ శాతం నమోదైంది. జార్ఖండ్‌లో ఒంటి గంట వరకు దాదాపు 46.8 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 39.31, పశ్చిమ బెంగాల్‌లో 45.07, బీహార్‌లో 35.65, హిమాచల్ ప్రదేశ్‌లో 48.63 పోలింగ్ శాతం నమోదైంది. తొలి ఆరు గంటల్లో పంజాబ్‌లో 37.8 శాతం ఓటింగ్ నమోదు కాగా, చండీగఢ్‌లో 40.14 ఓటింగ్ శాతం నమోదైంది. ఒడిశాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపు 37.64 శాతం ఓటింగ్ నమోదైంది