మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న వివిధ దేశాధినేతలు

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వారికి ఆహ్వాన లేఖలు కూడా వెళ్లాయి.

Update: 2024-06-06 06:39 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 8న ఆయన మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే విదేశీ నేతలతో పాటు పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలను కూడా ఆహ్వానాలు వెళ్లాయి.

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) 293 సీట్లు గెలుచుకోవడంతో వరుసగా మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరవుతున్నారని అక్కడి కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. విక్రమసింఘే ఇప్పటికే ఫోన్‌లో మోదీకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతోనూ మోదీ ఫోన్‌లో సంభాషించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఆమెను ఆహ్వానించారని, హసీనా కూడా అందుకు అంగీకరించారని దౌత్య వర్గాలు తెలిపాయి.

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.

మోదీ మొదటి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రాంతీయ గ్రూపింగ్ సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి బిమ్స్‌టెక్ దేశాల నేతలు హాజరయ్యారు. మూడోసారి జూన్ 8న మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

ఎన్నికలలో బిజెపి సొంతంగా మెజారిటీని పొందలేనప్పటికీ, పార్టీ నేతృత్వంలోని కూటమి 543 సీట్లలో 293 సీట్లు సాధించింది. దిగువ సభలో మెజారిటీ మార్క్ 272.

Tags:    

Similar News