హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ముందంజ

మండి నుండి బిజెపి అభ్యర్థి, నటి కంగనా రనౌత్ 54,042 ఓట్లు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సిమ్లా అభ్యర్థి సురేష్ కశ్యప్ 70,171 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Update: 2024-06-04 10:04 GMT

హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ ఆధిక్యంలో ఉంది. పోల్ ప్యానెల్ డేటా ప్రకారం.. మండి నుండి బిజెపి అభ్యర్థి, నటి కంగనా రనౌత్ 54,042 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హమీర్‌పూర్ స్థానం నుండి పోటీ చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 1,30,696 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సిమ్లా స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ సురేష్ కశ్యప్ 70,171 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనంద్‌ శర్మ..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ శర్మ బీజేపీ అభ్యర్థి రాజీవ్ భరద్వాజ్ చేతిలో ఓటమిని అంగీకరించారు. శర్మ తన బీజేపీ ప్రత్యర్థి కంటే 2,04,650 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

"కాంగ్రా బిజెపికి కంచుకోట అని తెలుసు. ఇక్కడి నుండి పోటీ చేయడం ఒక అద్భుత అనుభవం. నా ఓటమిని వినమ్రంగా అంగీకరిస్తున్నా. నన్ను విశ్వసించి నాకు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నా కృతజ్ఞతలు. అలాగే నాకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా. " అని ఓ మీడియా ఛానల్‌తో చెప్పారు.

ఎగ్జిట్ పోల్‌ ఫలితాలే కనిపిస్తున్నాయని, నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సురేష్ కశ్యప్ చెప్పారు.

ప్రార్థనలు చేసిన కంగనా రనౌత్, విక్రమాదిత్య సింగ్..

కౌంటింగ్‌కు ముందు రోజు కంగనా రనౌత్, ఆమె కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ ఇద్దరూ మండి స్థానం నుండి గెలవాలని ప్రార్థనలు చేశారు. సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జఖూ ఆలయాన్ని సందర్శించగా, రనౌత్ ప్రార్థనలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించింది.

2024 Lok Sabha polls, Himachal Pradesh, Kangana Ranaut, Anurag Thakur, Vikramaditya Singh, Anand Sharma,హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలు, ఉప ఎన్నికలు జరిగిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్రవ్యాప్తంగా 80 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. జూన్ 1న నాలుగు లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఉప ఎన్నికలు జరిగాయి.

సుజన్‌పూర్, ధర్మశాల, లాహౌల్ & స్పితి, బర్సర్, గాగ్రెట్ మరియు కుట్లేహార్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

Tags:    

Similar News